Bigg Boss Priyanka Jain: చేదు వార్త చెప్పిన ప్రియాంక.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడ్చిన నటి
Priyanka Jain: హౌజ్ నుంచి బయటకు రాగానే పెళ్లి కబురు చెబుతుంది అనుకుంటే.. ఓ చేదు వార్త చెప్పింది. అసలు బిగ్‌బాస్‌కు వెళ్లకుండ ఉండాల్సింది అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యింది.
Actress Priyanka Jain: బిగ్‌బాస్ ప్రియాంక జైన్.. ఈ పేరును ఎవరు మర్చిపోలేదు. బిగ్‌బాస్ ముందు వరకు పొట్టిపిల్లా అంటూ అందరిచేత క్యూట్‌గా పిలుపించుకున్న ప్రియాంక.. హౌజ్‌లో మాత్రం గట్టి పిల్లా అనిపించుకుంది. టాస్క్‌ల్లో తనదైన ఆట తీరుతో హౌజ్‌మేట్స్‌కి గట్టి పోటి ఇచ్చింది. టాస్క్ ఏదైనా తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోయింది. అలా చివరి వారం వరకు కొనసాగింది. అలా హౌజ్‌లో ఫుల్ యాక్టివ్ ఉంటూ ఎంతోమంది ప్రేక్షకులు ఆదరణ పొందింది. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు రాగానే గుడ్ న్యూస్ చెబుతుందని అంతా అనుకున్నారు. గత కొంతకాలంగా బుల్లితెర హీరో శివకుమార్‌తో ప్రేమలో ఉన్న ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
ఫ్యామిలీ వీక్‌లో ప్రియాంకకు సపోర్టుగా హౌజ్‌లోకి వచ్చిన శివతో బయటకు వెళ్లగానే పెళ్లి చేసుకుందామని అడగ్గా అతడు కూడా ఒకే అన్నాడు. ఇక హౌజ్ నుంచి బయటకు రాగానే ప్రియాంక పెళ్లి కబురు చెబుతుంది అనుకుంటే.. ఓ చేదు వార్త చెప్పింది. అసలు బిగ్‌బాస్ వెళ్లకుండ ఉండాల్సింది అంటూ బోరున విలపించింది. తన తల్లి క్యాన్సర్‌తో పోరాడిందంటూ బోరు విలపించింది. తన యూట్యూబ్ చానల్ వేదికగా ప్రియాంక ఈ విషాద వార్తలను పంచుకుంది. ఈ వీడియోలో ప్రియాంక మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను. ఎన్నో ఆశలతో బయటకు వచ్చాను. కానీ దానికి భీన్నంగా జరిగింది.
Also Read: నెరు రివ్యూ: దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ చేసిన హార్డ్ హిట్టింగ్ కోర్టు రూమ్ డ్రామా - ఎలా ఉందంటే?
అమ్మకు రక్తస్రావం..
నేను బిగ్‌బాస్ నుంచి రాగానే అమ్మ ఆస్పత్రి పాలైంది. తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని తెలిసింది. దీంతో అమ్మను చికిత్స కోసం ఆసుపత్రి అడ్మిట్ చేశాం. అమ్మకు కొద్ది రోజులుగా నెలసరి సమస్యతో బాధపడుతుంది. వరుసగా 15 నుంచి 20 రోజుల వరకు ఆమెకు బ్లీడింగ్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు తనకి పీరియడ్స్ అవుతున్నాయి. మొదట్లో ఇది వయసు రిత్యా వస్తున్న సమస్య అనుకుందట. కాబట్టి ఇలాంటి మార్పులు సహజమే అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమస్య ఎక్కువ కావడంలో పరీక్షలు చేయించాం. రిపోర్ట్స్‌లో తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తేలింది. అమ్మకు ఈ సమస్య నేను బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే మొదలైంది.
కానీ నన్ను సపోర్టు చేయాలని, బిగ్‌బాస్‌లో నన్ను చూడాలని ఆమె ఆస్పత్రికి వెళ్లలేదు" అని ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు తాను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండేదంటూ వీడియోలో ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. అనంతరం ప్రియాంక చెబుతూ.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక అమ్మను ఆస్పత్రిలో అడ్మిట్ చేశామంది. "డాక్టర్లు అమ్మకు లాపొరోస్కోపిక్ సర్జరీ చేయాలననారు. తన గర్భాశయాన్ని తీసేస్తామని చెప్పారు. దానివల్ల క్యాన్సర్ సమస్య పూర్తి పోయే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారు"అంటూ బోరున ఏడ్చింది. ఆ తర్వాత తెరుకున్న ప్రియాంక ఇలా చెప్పుకొచ్చింది. డాక్టర్ల సూచన మేరకు అమ్మను ఆసుపత్రిలో చేర్పించామని, అయితే సర్జరీ చేయాలంటే బ్లడ్ కావాలన్నారంది.
అమ్మకు రక్తం తక్కువగా ఉండటంతో బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని సేకరించి ఆమెకు ఎక్కించారని తెలిపింది. ఇక ఆమెను సర్జరీ నిమిత్తం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లిన ద్రశ్యం నుంచి ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ వరకు ప్రతి ఫుటేజ్‌ని ప్రియాంక తన వీడియోలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక అందరికి ఓ సూచన ఇచ్చింది. ముఖ్యంగా అడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, శరీరంలో ఎదైన మార్పు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించింది. తమలా ఎవరూ ఈ తప్పు చేయొద్దని కోరింది.