News
News
వీడియోలు ఆటలు
X

Payal Ghosh: బాలీవుడ్ పై దుమ్మెత్తిపోసిన పాయల్ ఘోష్, మహిళాసాధికారత గురించి వారు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని వెల్లడి!

అందాల తార పాయల్ ఘోష్ బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ను ఏలుతున్న వారిలో సగానికిపైగా అవినీతిపరులేనని తేల్చి చెప్పారు. వారు మహిళాసాధికారత గురించి మాట్లాడటం నవ్వు తెప్పిస్తుందన్నారు.

FOLLOW US: 
Share:

ప్రముఖ నటి పాయల్ ఘోష్, మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఈసారి తను ఏకంగా బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. బాలీవుడ్ స్వభావం, దాన్ని ఏలుతున్న వారి నిజ స్వరూపాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ లో ఉన్న కొంత మంది ఇతరులను చంపి, వారి రక్తాన్ని మరొకరికి తినిపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంటీక్రిస్ట్ సమయంలో నాయకులు ప్రజలను చంపుతారు. అలాగే, బాలీవుడ్‌లోని కొందరు వ్యక్తులు సైతం అదే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వ్యక్తులు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే తనకు నవ్వుతో పాటు కోపం వస్తుందన్నారు.

బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాయల్ ఘోష్

“నేను కొన్నిసార్లు చాలా కోపంగా ఉంటాను. నా కోపాన్ని కూడా బయటకు  వ్యక్తపరుస్తాను. కానీ, నేను మీతో చెప్తున్నాను. బాలీవుడ్ ను ఏలుతున్న వారిలో కనీసం 50-60% మంది అవినీతిలో ఉన్నారు” అంటూ హాట్ కామెంట్స్ చేశారు.  ప్రియాంక చోప్రా ఇటీవలి 'బాలీవుడ్‌లో కార్నర్డ్' వ్యాఖ్యపైనా తను స్పందించారు. "బాలీవుడ్  అసలు స్వభావం ప్రతి ఒక్కరికి తెలుసు.  ప్రతి ఒక్కరు రంధ్రాన్వేషణ చేసేవాళ్లే. అలా అంటున్నందుకు క్షమించండి” అన్నారు.

బాలీవుడ్ దర్శకుడిపై సంచలన ఆరోపణలు

తెలుగులో  పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్, #MeToo ఉద్యమంలో పాల్గొన్నారు.  బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమాలో అవకాశం కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడి చేశాడని వెల్లడించారు. ఇలాంటి వాళ్లు ఇంకా బాలీవుడ్ లో ఉండటం బాధాకరమని తెలిపారు. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ సూసైడ్ నోట్ ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్ కు గురిచేసింది.  ‘‘నేను పాయల్ ఘోష్ ను, ఒక వేళ నేను సూసైడ్ చేసుకున్నా లేదా హార్ట్ ఎటాక్ తో చనిపోయినా దానికి కారణం ఎవరంటే?’’ అంటూ రాసి మిగతా ఖాళీను ఏమీ రాయకుండా వదిలేసింది. ఈ పోస్ట్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. 

ప్రస్తుతం  కృష్ణ అభిషేక్‌తో కలిసి పాయల్ 'రెడ్' సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో తను  ఎస్కార్ట్ పాత్రలో కనిపించనుంది. అంతేకాదు, ఈ చిత్రంలో శక్తి కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అశోక్ త్యాగి ఈ ఇంటెన్స్ అండ్ స్లిక్ థ్రిల్లర్‌ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక కాలేజీ అమ్మాయి గృహిణిగా మారి ఆ తర్వాత ఎస్కార్ట్‌ గా మారడం చుట్టూ తిరుగుతుంది.  

తెలుగులో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్

పాయల్ ఘోష్ కలకత్తాకు చెందిన నటి. మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది పాయల్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘మిస్టర్ రాస్కెల్’ సినిమాలో  నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

View this post on Instagram
 
A post shared by Payal Ghosh (@iampayalghosh)

Read Also: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల 

Published at : 09 Apr 2023 09:45 PM (IST) Tags: Actress Payal Ghosh Bollywood payal ghosh sensational comments

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి