Malavika Mohanan: నాలో కొత్త జోష్ - రెబల్ స్టార్‌పై 'ది రాజా సాబ్‘ బ్యూటీ క్రేజీ కామెంట్స్!
‘ది రాజా సాబ్‘ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతోంది అందాల భామ మాళవిక మోహనన్. తొలి తెలుగు సినిమాలోనే ప్రభాస్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది.
Malavika Mohanan About Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో ‘ది రాజా సాబ్’ సినిమా తెరకెక్కుతోంది. హారీర్ రొమాంటిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రెబల్ స్టార్ ను సరికొత్త గెటప్ లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రభాస్ తో మూవీ చేయడం సంతోషంగా ఉంది-మాళవిక
తొలి తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న క్యూట్ బ్యూటీ మాళవిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఫస్ట్ తెలుగు మూవీలోనే ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. “తెలుగులో నేను చేస్తున్న ఫస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ఫస్ట్ మూవీలోనే ప్రభాస్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయన తో మూవీ చేస్తుంటే నాలో కొత్త జోష్ వచ్చినట్లు అయ్యింది. ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి సరైన సినిమా కావాలి అనుకున్నాను. నా కోరిక నెరవేరింది. ఈ మూవీ రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
మంచి క్యారెక్టర్లతో మంచి గుర్తింపు- మాళవిక
మాళవిక తమిళ్, మళయాలంలోని పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, ధనుష్, విక్రమ్ తో జోడీ కట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో హీరోలతో పోల్చితే హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ కు మేకర్స్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని ఆమె చెప్పుకొచ్చింది. మంచి పాత్రల ద్వారానే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. “సినిమా పరిశ్రమలో హీరోల పాత్రలతో పోల్చితే హీరోయిన్ల పాత్రలకు అంత కేరింగ్ ఉండదు. నాకు మాత్రం మంచి క్యారెక్టర్లే దొరకుతున్నాయి. గత సినిమాల్లోనూ దర్శకులు నా పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ చాలా బాగుటుంది” అని చెప్పుకొచ్చింది.
పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను!
మాధురీ దీక్షిత్, రేఖ, శ్రీదేవి లాంటి వారు అందం, అభినయానికి తోడు చక్కటి పాత్రలు చేసే అవకాశం రావడం వల్లే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారని మాళవిక చెప్పుకొచ్చింది. తనకు కూడా వారిలా పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. “ప్రేక్షకులు మర్చిపోలేని పవర్ ఫుల్ పాత్రలు పోషించాలనేది నా కోరిక. అలాంటి క్యారెక్టర్లను చేసేందుకు ఇష్టపడుతాను” అని చెప్పుకొచ్చింది.
ఇటీవల ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మాళవి, ఇప్పుడు ‘ది రాజా సాబ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. టాలీవుడ్ లో తొలి సినిమానే ప్రభాస్ తో చేయడం ఆమెకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది(2025) సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Also: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్