By: ABP Desam | Updated at : 07 Apr 2023 03:01 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Kushboo/Instagram
Actress Kushboo: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. తనకు జ్వరం, ఒళ్లు నొప్పులు అలసటతో బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుష్బూ కు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు.
కుష్బూ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేశారు. అయితే తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి చేపట్టారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిపక్షాలకు తనదైన రీతిలో కౌంటర్ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కుష్బూ. అయితే తాజగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారుతోంది. తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఓ ఫోటోను షేర్ చేశారు.
ఈ ఫోటోతో ఓ నోట్ ను రాసుకొచ్చారు. ఇందులో కుష్బూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్నీ ఒకేసారి వచ్చేశాయని చెప్పుకొచ్చారు. తనకు ఎడినో వైరస్ సోకిందని, అందుకే చాలా కష్టంగా, బలహీనంగా అనిపిస్తోందని తెలిపారు. ఎవరికైనా వైరస్ సోకినట్టుగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి అని సూచించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం కుష్బూ ఇటు రాజకీయాలు, అటు సినిమాలతో ఫుల్ బీజీ గా ఉంటున్నారు. నటిగా సౌత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో 2010లో డీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. 2020 వరకూ కాంగ్రెస్ లో పనిచేసిన కుష్బూ తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుష్బూ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అధిష్టానం ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ పదవి చేపట్టిన తర్వాత కుష్బూ చిరంజీవిను ప్రత్యేకంగా కలసిన విషయం విదితమే.
ఇక సినిమాల్లో కూడా కుష్బూ అదే స్పీడ్ ను కొనసాగిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మెరిశారు. ఈ సందర్భంగా మణిరత్నం, సుహాసినితో ఉన్న రిలేషన్షిప్ ను గుర్తుచేసుకున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు కుష్బూ. రీసెంట్ గా గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Also Read : మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!
Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా
Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?