News
News
X

Nayanthara: నయన్ 'సరోగసి'పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ - విఘ్నేష్‌కు ప్రభుత్వం నోటీసులు?

'పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ' నయన్, విఘ్నేష్ లను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరిందని సమాచారం.

FOLLOW US: 

నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. సరోగసీ పద్దతిలో ఈ జంట తల్లిదండ్రులు అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం. తమకు ట్విన్స్ పుట్టారంటూ దర్శకుడు విఘ్నేష్ ఓ పోస్ట్ పెట్టారు. ''నయన్, నేను తల్లిదండ్రులు అయ్యాం. మాకు ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ అబ్బాయిలే. మా ప్రార్థనలు, పెద్దల ఆశీర్వాదాలు... అన్నిటికి మంచి చల్లటి చూపులు కలిసి మా ఇద్దరికీ మరో ఇద్దర్ని భగవంతుడు ప్రసాదించాడు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి'' అంటూ ఫొటోలను షేర్ చేశారు. 

ఇదిలా ఉండగా.. సరోగసీకి సంబంధించిన నటి కస్తూరి చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ''ఇండియాలో సరోగసీను బ్యాన్ చేశారు. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీన్ని ప్రోత్సహించకూడదు. రాబోయే రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం'' అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన నయన్ ఫ్యాన్స్ కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. 

News Reels

దీంతో ఆమె మరో ట్వీట్ చేసింది. 'అర్హత గల లాయర్ గా ఈ చట్టంపై విశ్లేషణ చేసే హక్కు నాకుంది. నేనెవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేయలేదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ లో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. చట్టాన్ని అతిక్రమించినందుకు నయన్, విఘ్నేష్ లకు కోర్టు నోటీసులు పంపిందని టాక్. 'పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ' నయన్, విఘ్నేష్ లను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరిందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు హెల్త్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు. సరోగసీ ద్వారా పిల్లలను పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయని.. వాటిని నయన్, విఘ్నేష్ ఫాలో అయ్యారా..? లేదా..?  అనేది మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ని అడిగి తెలుసుకుంటామని అన్నారు.

జూన్ 9న నయన్, విఘ్నేష్ ల వివాహం జరిగింది. అప్పుడే వీరికి పిల్లలు ఎలా పుట్టారనేది చాలా మందికి అర్ధం కాలేదు. ఆ తరువాత సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులైనట్లు క్లారిటీ వచ్చింది. పెళ్లైన వెంటనే మాల్దీవులకు నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్ వేశారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న 'జవాన్' షూటింగులో నయనతార జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకు పలు సార్లు వచ్చారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ రిలీజ్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ చేశారు. ఆ సమయాల్లో ఎప్పుడూ ఆమె ప్రెగ్నెంట్ అనేది బయటకు రాలేదు.

మాల్దీవ్స్ తర్వాత స్పెయిన్ ట్రిప్ కూడా వేశారు నయన్ అండ్ విఘ్నేష్. ముందు మాల్దీవ్స్, ఆ తర్వాత స్పెయిన్... ఎప్పటికప్పుడు విఘ్నేష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కడా నయనతార గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. మరి, ఇప్పుడు పిల్లలు ఎలా పుట్టారు? అనే సందేహం సగటు సినిమా ప్రేక్షకుడిలో రావడం సహజం.

పెళ్లికి ముందు నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. సరోగసీ ద్వారా పండంటి కవలలకు జన్మ ఇచ్చారని సమాచారం. సరోగసీ ద్వారా షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, తెలుగులో లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరారని చెప్పవచ్చు. 

Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

Published at : 10 Oct 2022 04:32 PM (IST) Tags: nayanthara Kasturi Vighnesh Shivan

సంబంధిత కథనాలు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'