Actress Jayalalitha: శరత్ బాబుతో కలిసి ఒక బిడ్డని కందామనుకున్నాను, కానీ.. - నటి జయలలిత కామెంట్స్ వైరల్
Actress Jayalalitha: జయలలిత అందరూ బోరింగ్ పాపగా పిలిచే ఈ యాక్టరస్ ఎన్నో సినిమాలు చేసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన జీవితానికి సంబంధించి విషయాలను పంచుకుంది ఆమె.
Actress Jayalalitha About Her Life: అలనాటి నటి జయలలిత. బోరింగ్ పాపగా పిలుచుకునేవారు ఆమెను. అప్పట్లో ఎన్నో సినిమాల్లో ఎంతోమంది సరసన నటించిన ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడిక సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సీరియల్స్ లో మంచి మంచి రోల్స్ ప్లే చేసి బుల్లితెరలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు జయలలిత. తన జీవితం గురించి, శరత్ బాబు ఆమె మధ్య ఉన్న సంబంధం గురించి తదితర అంశాల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె.
అటువైపు మనసు పోలేదు...
"మొదటి పెళ్లి, బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ వైపు, కొత్త బంధంవైపు అడుగులు వేయలేదా?" అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. "ఎందుకో ప్రేమ వైపు మనసు మళ్లలేదు. ఎవరి తోడు అవసరం లేదు అనిపించింది. చాలామంది "రెండో పెళ్లి చేసుకుంటాం, ఉంచుకుంటాం" అంటూ వచ్చారు. కానీ, భగవంతుడు నన్ను అటువైపు వెళ్లనివ్వలేదు. అన్నపూర్ణమ్మ వీళ్లంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తతు తీసుకోండి అని అన్నారు. అక్క పిల్లలు వాళ్లు ఉన్నారు కదా చాలు అనుకున్నాను" అని చెప్పారు జయలలిత.
బిడ్డను కనాలి అనుకున్నాం..
"శరత్ బాబుది, నాది మనసు బంధమే.. నేను బాగా అనుకున్నాను. కానీ, ఆయన కొంచెం అనుకుని వదిలేశాడు. ఆయన ఉన్నా చెప్పేదాన్ని. మహానుభావుడు, ఆయనతోనే కలిసి యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకు ఒక గైడ్ ను పంపించాడు. చాలా మంచి వ్యక్తి. ఒకరి రూపాయి తినరు. ఒకరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీని చూసుకునేవాడు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్లే పెళ్లి చేసుకోకుండా ఆపారు. చాలా ప్లానింగ్ చేసుకున్నాం. బిడ్డని కూడా కనాలి అనుకున్నాం. దానికి సంబంధించి ప్లాన్ చేసుకున్నాం కూడా. కానీ, ఆయన చాలా ఆలోచిస్తారు. రేపు నువ్వు నేను చనిపోయాక ఆస్తికోసం ఆ బిడ్డని ఏం చేస్తారో? అనేవారు. నన్ను లలిత లలిత అని పిలుస్తుంటారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక తమ్ముడు నాతో క్లోజ్ గా ఉంటారు. వాళ్ల అబ్బాయి కూడా నాతో టచ్ లో ఉంటారు. వాళ్ల కుటుంబంలో మా మధ్య ఏం జరిగిందో తెలీదు. నాకు ఆయనకు పరిచయం ఉందనే తప్పించి, డీప్ గా వెళ్లాను అని తెలీదు" అని అన్నారు జయలలిత.
"ఒకవైపునే విని జడ్జ్ చేయలేం కదా. రమాప్రభ, ఆయన కలిసి ఉన్నప్పుడు ఎం జరిగిందో తెలీదు. నా విషయంలో మాత్రం చాలామంచి వ్యక్తి. నా అంతట నేను బావ బావ అని పిలుస్తూ వెళ్లేదాన్ని. అలా పురాణాలు గురించి, గుళ్ల గురించి చెప్పేవాడు. అలా యాత్రలకు వెళ్లడం ప్రారంభమైంది. ఆయన లలిత లలిత అని పిలవడం, కొన్ని విషయాల్లో చాలా దగ్గరగా అయిపోయాం. నేను ఆయన్ని అయ్యప్ప అని పిలుస్తాను. నా ఫోన్లో తత్వమసి అని ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్లాను. హాస్పిటల్ కి వెళ్లాను చూడలేకపోయాను ఆయన్ను చివరి రోజుల్లో" అంటూ తనకు శరత్ బాబుతో ఉన్న బంధం గురించి చెప్పారు.
Also Read: రోజూ ఇన్ని గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీకు ‘డయాబెటిస్’ తప్పదు!