Type 2 Diabetes Risk: రోజూ ఇన్ని గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీకు ‘డయాబెటిస్’ తప్పదు!
Type 2 Diabetes రోజుకి 6గంటల కంటే తక్కువ నిద్రపోతే డయాబెటిస్ బారినపడతారని స్టడీస్ చెప్తున్నాయి. నిద్రపోకపోతే.. గ్లూకోజ్ మెటబాలిజం, హార్మోన్స్ రిలీజ్ అవ్వడంలో తేడాలు ఏర్పడతాయి.
Type 2 Diabetes Risk: ఈ రోజుల్లో ప్రజలు బిజీ బిజీగా గడిపేస్తూ ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. మొబైల్ ఫోన్లు, ఓటీటీలకు అలవాటుపడి నిద్రను దూరం చేసుకుంటున్నారు. అది ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని చెప్తున్నారు డాక్టర్లు. ప్రతి రోజు కచ్చితంగా 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు. సరిగ్గా నిద్రపోని వారికి టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ.. నిద్రను నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్ వచ్చే అకవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేస్తున్నాయి.
అధ్యయనంలో ఏం తేలిదంటే?
గతేడాది సుమారు 2,50,000 మందిపైన స్టడీ చేసి ఈ రిపోర్ట్ ఇచ్చారట సైంటిస్టులు. వాళ్ల ఆహారపు అలవాట్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్టడీ చేయగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీంటున్న వారికి కూడా నిద్రలేమి కారణంగా.. టైప్ - 2 డయాబెటిస్ అటాక్ అయినట్లు గుర్తించామని రిపోర్ట్ లో వెల్లడైంది.
హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ..
శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ లో తేడాలు ఏర్పడతాయి. దానివల్ల టైప్ 2 డయాబెటిస్‌కు గురవ్వుతారు. మనిషికి ఎప్పుడైతే సరిగ్గా నిద్ర ఉండదో.. అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ లో కూడా మార్పులు వస్తాయి. ఫలితంగా డయాబెటిస్ బారినపడతారని డాక్టర్లు చెప్తున్నారు. టైప్- 2 డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, హార్ట్ ఎటాక్ బారినపడతారని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు షుగర్ ని మానిటర్ చేసుకుంటూ.. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, సరైన మెడికేషన్ తీసుకోవాలని, నిద్ర చక్కగా పట్టేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలో ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటిస్ ఉందని, దాదాపు 95 శాతం మంది టైప్ - 2 డయాబెటిస్ బారినపడిన వాళ్లే ఉన్నట్లు రిసెర్చ్‌లో తేలింది.
నిద్రకి, డయాబెటిస్‌కు సంబంధం ఏంటి?
నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నుహా అలా సయ్యద్ అన్నారు. “నిద్రలేమితో వచ్చే సమస్యలను రెండు రకాలుగా విభజిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు, తాత్కాలిక సమస్యలు. ఇన్ సోమ్నియా, స్లీప్ అప్నియా, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ లాంటివి దీర్ఘకాలిక సమస్యల కిందికి వస్తాయి. వీటి కారణంగా సరిగ్గా నిద్రపట్టాడు. దానివల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా టైప్ - డయాబెటిస్ అటాక్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. స్ట్రెస్, ట్రావెలింగ్ తదితర కారణాల వల్ల నిద్రపట్టకపోవడం వల్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతాయి” అని అన్నారు డాక్టర్ నుహా ఆలి.
మన శరీరం సిర్కాడియన్ రిథమ్స్ పై ఆధారపడి నడుస్తుంది. అంటే మన అవయవాలు, కణజాలాలు, గ్రంథులు అన్నీ ఒక పద్ధతిలో పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే ఇవి పనిచేయడం తగ్గిపోతుందో అప్పుడు మన శరీరం ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తుంది. ఇన్సులిన్ గ్రాహకాలు ఎప్పుడైతే సరిగ్గా పనిచేయవో.. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని పెంచే గ్రెలిన్ పెరుగుతుంది. దీంతో ఆకలి పెరిగిపోయి వీపరీతంగా తినడం వల్ల కూడా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగిపోతాయి. దానివల్ల టైప్ - 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు వెల్లడించారు.
నిద్ర ఎక్కువైనా ఇబ్బందే..
వివిధ కారణాల వల్ల చాలామంది చాలాసార్లు సరిగ్గా నిద్రపోరు. అయితే, ఎక్కువగా నిద్రపోయినా ఇబ్బందులు తలెత్తుతాయట. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయినా, తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయినా ఇబ్బంది తలెత్తుతుంది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అంతర్గత సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు డాక్టర్లు. టైం లేనప్పుడు చాలామంది న్యాప్ వేస్తుంటారు (పది నిమిషాల పాటు డీప్ స్లీప్ లోకి వెళ్లటం). అది అప్పటికప్పుడు ఎనర్జీ ఇస్తుందే తప్ప.. దీర్ఘకాలిక రోగాలు రాకుండా చేయదు అని చెప్తున్నారు డాక్టర్లు. మన శరీరానికి కచ్చితంగా తగినంత నిద్ర ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. అప్పుడే పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు సరిగ్గా నిద్ర ఉండదు. అలాంటప్పుడు రోజులో ఒకసారి న్యాప్ వేయడం వల్ల తాత్కాలిక ఉపసమనం మాత్రమే కలుగుతుందని రిసెర్చ్ లో తేలిందని, ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిందేనని, నిద్ర పోవాలని సూచించారు.
Also Read: వెన్నునొప్పిని దూరం చేసే మూడు సింపుల్ వ్యాయామాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.