అన్వేషించండి

Sidharth Kiara Advani wedding: కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి డేట్ ఫిక్స్, వేదిక ఎక్కడంటే ?

బాలీవుడ్ అందాల జంట కియారా-సిద్దార్థ్ పెళ్లి గురించి ఓ వార్త ఒకటి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగబోతున్నట్టు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలా మంది ప్రేమ జంటలు పెళ్లి పీటలు ఎక్కాయి. ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న జంటలు కూడా 2022 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. అయితే బాలీవుడ్ లో అందాల జంట కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా జంట ప్రేమ, పెళ్లి గురించి బాలీవుడ్ లో అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ 2022 లో మాత్రం వారి పెళ్లికి సంబంధించి ఎలాంటి వార్తా రాలేదు. అయితే తాజాగా వీరి పెళ్లి గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇక కియారా-సిద్దార్థ్ పెళ్లి వేడుక రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్యాలెస్ హోటల్ లో  జరగబోతోంది. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ముంబైలో జరగుతాయని, పెళ్లి మాత్రం ఫిబ్రవరి 6 న  రాజస్థాన్ లో జరగుతుందని బిటౌన్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కియారా-సిద్దార్థ్ పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జనవరి లో వీరిద్దరూ తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి మాత్రం వీరి పెళ్లి ఖాయమనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2020 నుంచి వీరిద్దరూ డేటింగ్ ఉన్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఇద్దరూ పలు సార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తుండటం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చాయి. వీరి ప్రేమ, పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఈ ఏడాదంతా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై కియారా-మల్హోత్రా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా వీరి పెళ్లి ఖరారు అయింది అనే వార్త తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

కియారా అద్వానీ మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయింది. కియారా-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. 2021 లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కియారా అద్వానీ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ గా కనిపించనుంది. అటు సిద్ధార్థ్‌ కూడా పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన ఇటీవల రష్మిక మందన్నాతో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం సిద్దార్థ్ ఆ సినిమా ప్రమోషన్స్‌ లో బిజీ బిజీగా ఉన్నాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget