SRK Promotes Brahmamudi: ‘బ్రహ్మముడి’కి షారుఖ్ ఖాన్ ప్రమోషన్ - ఏం చెప్పారో తెలుసా?
స్టార్ మా లో త్వరలో ప్రసారం కాబోతున్న కొత్త సీరియల్ 'బ్రహ్మముడి'. కార్తీకదీపం స్థానంలో జనవరి 24 నుంచి టెలికాస్ట్ కాబోతుంది.
![SRK Promotes Brahmamudi: ‘బ్రహ్మముడి’కి షారుఖ్ ఖాన్ ప్రమోషన్ - ఏం చెప్పారో తెలుసా? Actor Shah Rukh Khan Promotes Brahmamudi Telugu Serial Starts from Jan 24th onwards SRK Promotes Brahmamudi: ‘బ్రహ్మముడి’కి షారుఖ్ ఖాన్ ప్రమోషన్ - ఏం చెప్పారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/3c707f999dfe38ab46836c669d2564991674027757867521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘స్టార్ మా’లో త్వరలో ప్రారంభం కాబోతున్న సీరియల్ ‘బ్రహ్మముడి’. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ఎలా ఒక్కటి కాబోతున్నారనే కథాంశంతో జనవరి 24వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీరియల్ ప్రమోషన్ కోసం కోసం ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వచ్చేశారు. సీరియల్ హీరోయిన్ కావ్య గురించి చాలా చక్కగా చెప్పారు. ఆడపిల్ల అయినా కుటుంబ భారాన్ని ఎంతో బాధ్యతగా మోస్తుంది కావ్య. ఆర్టిస్ట్ అయిన కావ్య ఎంతో బాధ్యత కలిగిన అమ్మాయి అంటూ షారూఖ్ కావ్య గురించి చెప్పుకొచ్చారు. ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 కి ప్రసారం కాబోతుంది.
బిగ్ బాస్ మానస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సీరియల్ ప్రమోషన్స్ జోరుగానే ఉన్నాయి. తమిళ బుల్లితెర నటి దీపికా రంగరాజు ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ప్రతి విషయం పర్ఫెక్ట్ గా ఉండటంలో పాటు స్టేటస్ కూడా చూసే వ్యక్తి సీరియల్ హీరో రాజ్ మనస్తత్వం. చేసే పనిలో సంతోషం, ఆత్మ సంతృప్తి వెతుక్కుంటూ ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి చెల్లెళ్లకి మంచి భవిష్యత్ అందించాలని తాపత్రయ పడే అమ్మాయి కావ్య. అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్న ఈ జంట ఎలా ఒక్కటి కాబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజుల్లో ప్రసారం కాబోతున్న బ్రహ్మముడి చూడాల్సిందే.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి ఫ్రెండ్ గా చేసిన గౌతమ్(కిరణ్ కాంత్) ఈ సీరియల్ లో మరొక హీరోగా నటిస్తున్నాడు. బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకున్న హమీదా ఇందులో హీరోయిన్ చెల్లెలి పాత్ర పోషిస్తుంది. బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి ఇది రీమేక్. బుల్లితెరని ఆరేళ్ళ పాటు నిర్విరామంగా ఏలిన కార్తీకదీపం సీరియల్ కి ఈ వారంతో ఎండ్ కార్డ్ పడనుంది. దాని స్థానంలో రాబోతున్న సీరియల్ ఈ ‘బ్రహ్మముడి’. కార్తీకదీపం సీరియల్ ని ఆదిరించినట్టుగానే బ్రహ్మముడి సీరియల్ ని కూడా ఆదరించాల్సిందిగా డాక్టర్ బాబు, వంటలక్క దీప కోరారు. ప్రత్యేకంగా ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క కొత్త సీరియల్ కి విషెస్ చెప్పారు.
Also Read: ‘బ్రహ్మముడి’ ముహూర్తం ఫిక్స్ - ఈ వారం ‘కార్తీక దీపం’ ముగింపు?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)