అన్వేషించండి

Brahamudi Serial: ‘బ్రహ్మముడి’ ముహూర్తం ఫిక్స్ - ఈ వారం ‘కార్తీక దీపం’ ముగింపు?

కార్తీకదీపం సీరియల్ స్థానంలో రాబోతున్న కొత్త సీరియల్ ‘బ్రహ్మముడి’ వచ్చే వారం నుంచి టెలికాస్ట్ కానుంది.

బుల్లితెర రారాజుగా మారిన ‘కార్తీకదీపం’ సీరియల్ ముగిసిపోతోంది. దాని స్థానంలో బిగ్ బాస్ మానస్ హీరోగా కొత్త సీరియల్ ‘బ్రహ్మముడి’ (ఒకరికి ఒకరై ట్యాగ్ లైన్) రాబోతోంది. ప్రతి దాంట్లో హోదా చూసే అబ్బాయి.. చేసే ప్రతి చిన్న పనిలో సంతోషం వెతుక్కునే ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి మధ్య జరిగే కథ ‘బ్రహ్మముడి’. తమిళ బుల్లితెర నటి దీపికా రంగరాజు ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సీరియల్ కి సంబంధించి ప్రోమోలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సీరియల్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కొత్త సీరియల్ ‘బ్రహ్మముడి’కి వంటలక్క దీప(ప్రేమి విశ్వనాథ్) ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.

దుగ్గిరాల కుటుంబానికి ముగ్గురు వారసులు. చిన్నవాడు కళ్యాణ్ కవితలు రాస్తాడు. అతనేవారో కాదు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి బెస్ట్ ఫ్రెండ్ గా కనిపించే గౌతమ్. ఇక రెండో వాడు రాహుల్ ప్లే బాయ్. ఇక పెద్ద వాడు రాజ్యవర్థన్ (మానస్).  చేసే పనిలో స్టేటస్ తో పాటు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. స్వచ్చమైన ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ రెండో వాడు మాత్రం రాజ్యవర్థన్ కోరుకున్నవన్నీ లాగేసుకుంటాడు. ఆ కుటుంబానికి తన ముగ్గురు కూతుళ్ళు కోడళ్ళు కావాలని ఆశపడుతుంది ఓ తల్లి. గాల్లో మేడలు కట్టే ఆ తల్లి కూతుళ్లకి గొప్ప ఇంటి సంబంధాలు చేయగలదా లేదా అనేది తెలియాలంటే కొత్తగా ప్రారంభం కాబోతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ చూడాల్సిందే.

Also Read: సైకో మోనితకు హిమ రూపంలో మరో అవకాశం, మళ్లీ మాయలో పడిపోయిన సౌందర్య, కార్తీక్

మట్టితో బొమ్మలు చేసే ప్రదర్శనకి పెడుతుంది హీరోయిన్ కావ్య. వాటిని ముగ్గురు అన్నదమ్ములు చూస్తారు. ఒకరు బొమ్మ అందం గురించి మాట్లాడితే మరొకరు ఆ బొమ్మ చేసిన అమ్మాయి అందం గురించి మాట్లాడతాడు. కానీ మన హీరో మాత్రం ఆ బొమ్మలో ఏముంది త్రీడీలో ప్రింట్ వేస్తే ఇంతకంటే అందంగా ఉంటుందని తేలికగా కొట్టి పడేస్తాడు. “ప్రాణం లేని వాటికి కూడా తన చేతులతో ప్రాణం పోసి క్రియేటివిటీతో మలచగలిగే వాళ్ళే  ఆర్టిస్ట్ అంటే” అని కావ్య చెప్పడం తన వ్యక్తిత్వం ఏంటో చెప్పేస్తుంది. భిన్న మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరినీ ఆ బ్రహ్మ ఎలా ముడి వేశాడో తెలుసుకోవాలంటే బ్రహ్మముడి చూడాల్సిందే. జనవరి 24 నుంచి ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30కి ప్రసారం కాబోతోంది. 

బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. బిగ్ బాస్ మానస్ హీరోగా వస్తున్నాడు. బిగ్ బాస్ హమీదా ఈ సీరియల్ లో హీరోయిన్ చెల్లెలి పాత్ర పోషిస్తోంది. తనకి ఇదే తొలి సీరియల్ కావడం విశేషం. అటు కథానాయికగా తమిళ సీరియల్ నటి దీపికా రంగరాజుకి కూడా ఇదే తెలుగులో తొలి సీరియల్.

Also Read: భారమైన హృదయంతో కాలేజీ బయటకు రిషి, కోటి ఆశలతో కాలేజీ లోపలకు వసు- వాటే సీన్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget