Radhe Shyam Trailer: 'రాధేశ్యామ్' ట్రైలర్ లో ఈ మిస్టేక్ ను గమనించారా?
తాజాగా 'రాధేశ్యామ్' సినిమా రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.
![Radhe Shyam Trailer: 'రాధేశ్యామ్' ట్రైలర్ లో ఈ మిస్టేక్ ను గమనించారా? Actor Sathyaraj seen in telugu version of Radheshyam Trailer Radhe Shyam Trailer: 'రాధేశ్యామ్' ట్రైలర్ లో ఈ మిస్టేక్ ను గమనించారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/2059b07020247f32263f5c4dbcc970ce_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఫైనల్ గా మార్చి 11న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.
ప్రభాస్ చెప్పే డైలాగ్స్, సన్నివేశాలు చాలా బాగున్నాయి. అయితే ఓ ఫ్రేమ్ లో మాత్రం సత్యరాజ్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ గురువు పాత్రలో కృష్ణంరాజు నటించారు. తెలుగు వెర్షన్ లో మాత్రమే కృష్ణంరాజు కనిపిస్తారు. మిగిలిన భాషల్లో ఆ పాత్రలో సత్యరాజ్ కనిపిస్తారు. అయితే ఈరోజు విడుదలైన తెలుగు ట్రైలర్ వెర్షన్ లో సత్యరాజ్ కనిపించారు.
బహుసా చిత్రబృందం అన్ని భాషలకు కలిపి ఒకటే ట్రైలర్ ను కట్ చేసినట్లుంది. అందుకే కృష్ణంరాజుకి బదులుగా సత్యరాజ్ కనిపించారు. ఇదొక టెక్నికల్ ఎర్రర్ మాత్రమేనని.. తెలుగు వెర్షన్ లో విక్రమాదిత్య గురువుగా కృష్ణంరాజు మాత్రమే కనిపిస్తారని చెబుతున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)