By: ABP Desam | Updated at : 31 Jan 2023 07:07 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Naga Babu/Instagram
బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొదట్లో ఈ షో కు వచ్చిన రెస్పాన్స్ చూసి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ను కూడా స్టార్ట్ చేశారు. అంతలా ఈ షో ప్రేక్షకాదరణ పొందింది. ఈ కామెడీ షో నుంచి ఎంతో మంది కళాకారులు కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షోకు మొదట్లో నటుడు నాగబాబు, నటి రోజా జడ్జీలుగా వ్యవహరించేవారు. అలా ఈ ప్రోగ్రాం కొన్నాళ్ల పాటు సజావుగా సాగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ షో నుంచి జడ్జి నాగబాబు తప్పుకున్నారు. ఆ తర్వాత కొంత మంది టాప్ కమెడియన్స్ కూడా షో ను విడిచి వెళ్లిపోయారు. అందుకు కారణాలు ఏంటనేది ఎవరికీ సరిగ్గా తెలియవు. అయితే నాగబాబు వెళ్లిపోవడంతో షోకు క్రేజ్ కాస్త తగ్గిందనే వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా నాగబాబు మళ్లీ తిరిగి రావాలని కోరారు. దీనిపై నాగబాబు స్పందించలేదు. అయితే నటుడు నాగబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ రీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీంతో ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి.
ఇంటర్వ్యూలో జబర్దస్త్ కు రి ఎంట్రీ పై నాగబాబు మాట్లాడుతూ.. మల్లెమాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తాను ఇప్పటికీ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో మాములుగానే మాట్లాడతానని అన్నారు. జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి వేరే కారణాలు ఉన్నాయని అన్నారు. వాస్తవానికి మనం ఎక్కడైనా పనిచేస్తే ఆ సంస్థ పరిధికి లోబడే పనిచేయాలి, మనకు సొంత ఆలోచన ఉండదని అన్నారు. అక్కడంతా వాళ్ల రూల్స్ ప్రకారం నడుస్తుందని, అది తనకు కొన్ని సందర్భాల్లో నచ్చలేదని, అందుకే తానంతట తానే బయటకు వచ్చేశానని అన్నారు. అంతేకాని మల్లెమాలతో ఎలాంటి గొడవ లేదని చెప్పారు. అక్కడ జరిగిన విషయాలు పూర్తిగా యాజమాన్యానికి తెలుసో లేదో కూడా తెలియదని, ఏదైనా పైవాళ్లు బానే ఉన్నా మధ్యలో కొంతమంది ఉంటారని, వారి స్వలాభం కోసం చేసే చిల్లర పనుల వల్లే ఇలాంటివి జరుగుతాయని వ్యాఖ్యానించారు. తానంతట తానే వచ్చేశాను కాబట్టి మళ్లీ వస్తానని తిరిగి అడిగే ప్రస్తక్తే లేదని, కానీ.. వాళ్లు రావాలని పిలిస్తే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినపుడు తనతో పాటు కొంత మంది కమెడియన్లు కూడా వచ్చేశారని చెప్పారు. అయితే తానెవరిని రమ్మనలేదని, తన రిస్క్ తాను తీసుకున్నానని, వాళ్ల రిస్క్ వాళ్లు తీసుకున్నారని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్లకి మంచి పేరే వచ్చిందని అన్నారు. చమ్మక్ చంద్ర లాంటి వారు సినిమాల్లో స్థిరపడ్డారని, ఆర్పీ హోటల్ రంగంలో స్థిర పడ్డారని చెప్పారు. అలాగే సుడిగాలి సుధీర్ కు మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయని అన్నారు. అయితే ఇక్కడ కంటెస్టెంట్లది గానీ, యాజమాన్యానిది గానీ ఎవరిదీ తప్పుకాదని, తాను ఎవరిదీ తప్పు అని చెప్పనని, ఎవరికి నచ్చింది వారు చేశారని అన్నారు. యాజమాన్యానికి ఉన్న పారామీటర్స్ లో తాను ఇమడలేకే బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చారు. మొత్తానికి నాగబాబు వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఆయన తిరిగి జబర్దస్త్ కు వస్తారో లేదో చూడాలి.
Also Read : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ
Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు
Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య
Guppedanta Manasu March 29th: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!
Brahmamudi March 29th: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్