Manchu Manoj: 'భీమ్లా నాయక్' చిత్రంపై మంచు మనోజ్ కామెంట్, విష్ణు చూశాడో లేదో!
ఇప్పటికే హరీష్ శంకర్ 'భీమ్లానాయక్' సినిమాపై పాజిటివ్ ట్వీట్ వేయగా.. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలానే మార్పులు చేశారు. హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాముఖ్యతనిచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా రానా కనిపించారు. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఇప్పటికే హరీష్ శంకర్ 'భీమ్లానాయక్' సినిమాపై పాజిటివ్ ట్వీట్ వేయగా.. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఈ సినిమాని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. 'ఒకే ఫ్రేమ్ లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవాలి. త్రివిక్రమ్ గారి రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కుదోస్ టు సితార ఎంటర్టైన్మెంట్స్' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Can't ignore the extraordinary team who did a double extraordinary job!#TrivikramSrinivas guru's pen work,@saagar_chandrak direction & @MusicThaman music took this totally to the next level 🔥🔥🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 25, 2022
Kudos to @SitharaEnts 🤩#BheemlaNayakMania https://t.co/Z3og7vksiR