Jagapathi Babu - Lakshmi Manchu: నీకు, నాకు కొవ్వు ఎక్కువ కదా... లక్ష్మీ మంచుకు జగ్గూ భాయ్ దిమ్మతిరిగే కౌంటర్
Jagapathi Babu Reply To Lakshmi Manchu: నటుడు జగపతి బాబు నటి మంచు లక్ష్మికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నీకు, నాకు కొవ్వు ఎక్కువ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు.
Actor Jagapathi Babu Counter To Manchu Lakshmi: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన ఫారిన్ వెకేషన్స్ తో పాటు డైలీ అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా హెల్త్ కు సంబంధించి ఓ టిప్ చెప్పారు. వాకింగ్ తర్వాత తాను తీసుకునే జ్యూసుల గురించి నెటిజన్లకు వివరించే ప్రయత్నం చేశారు. ‘‘గంటసేపు వాకింగ్ అయిపోయింది. కాకరకాయ జ్యూస్ తాగాను. బ్రహ్మాండంగా ఉంది.. ఛండాలంగా. ఆ తర్వాత ఇది బెండకాయ జ్యూస్. దీనమ్మా ఇది కూడా ఛండాలంగా ఉంది. ఆ తర్వాత బొప్పాయి, యాపిల్, కీర నా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్. దీని తర్వాత ఓట్ మీల్, లేదంటే సద్ధి అన్నం తింటాను. ఆ తర్వాత మళ్లీ జిమ్ కు వెళ్తాను. అందరూ బ్రేక్ ఫస్ట్ చేసినా, చేయకున్నా, వర్కౌట్స్ తప్పకుండా చేయండి’’ అని చెప్పుకొచ్చారు.
బెండకాయ జ్యూస్ ఎందుకు?- మంచు లక్ష్మి
ఈ వీడియోను చూసి నటి మంచు లక్ష్మి ‘బెండకాయ జ్యూస్’ ఎందుకు? అని జగపతి బాబును ప్రశ్నించింది. ఈ క్వశ్చన్ కు జగ్గూ భాయ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. “లచ్చిమి, బెండకాయ రసం కొలెస్ట్రాల్ కు చాలా మంచిది. నాకు, నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరం” అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై చూసి మంచు లక్ష్మి.. “నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నో.. మెంటల్ ఇష్యూస్ తప్ప ఇంకా ఏమీ లేవు” అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టులు చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన జగపతి బాబుకు మంచు లక్ష్మితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదే చనువుతో ఆయన అలా ఆటపట్టించి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: 60 ఏళ్లు దాటినా జగపతి బాబు ఇంత ఫిట్‌గా ఉండడానికి రీజన్స్ ఇవే.. బెండకాయ జ్యూస్లట, కాకరకాయ రసాలట
View this post on Instagram
విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు
ఇక జగపతి బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విలన్ పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబుతో కలిసి పని చేశారు. హీరోగా చేసిన సినిమాలతో పోల్చితే విలన్ గానే మాంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల్లో నటించిన జగపతి బాబు, అద్భుత నటనతో ఏడు నంది అవార్డులను అందుకున్నారు. తెలుగులో ఆయన చివరగా ‘రుద్రాంగి’ సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన మరే సినిమాలో చేస్తున్నట్లు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటున్నారు.
Read Also: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్