NBK107: బాలయ్యతో యాక్షన్ కి దిగిన దునియా విజయ్
NBK107 సినిమాలో దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
![NBK107: బాలయ్యతో యాక్షన్ కి దిగిన దునియా విజయ్ Actor Duniya Vijay joined sets on NBK107 NBK107: బాలయ్యతో యాక్షన్ కి దిగిన దునియా విజయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/c8237895f6eb8cc5b02d966383fae7a3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అలరించారు బాలయ్య.
ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్నారు. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. కథ ప్రకారం.. దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బాలయ్య, దునియా విజయ్ ల మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని సమాచారం. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. దీంతో కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. కానీ బాలకృష్ణ టైటిల్ చివర్లో కులం ట్యాగ్స్ ఉండకూడదని చెప్పారట. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)