Aamir Khan In NTR 31: జూనియర్ ఎన్టీఆర్ మూవీలో అమీర్ ఖాన్ - ప్రశాంత్ నీల్ ఫర్ఫెక్ట్ ఫ్లాన్!
ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ కీరోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
‘లాల్ సింగ్ చద్దా’ ఘోర పరాభవం తర్వాత అమీర్ ఖాన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ను ప్రశాంత్ నీల్ సంప్రదించినట్లు తెలుస్తోంది.
‘లాల్ సింగ్ చద్దా’ పరాభవంతో సినిమాలకు విరామం
‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఘోర పరాభవం తర్వాత అమీర్ ఖాన్ చాలా అప్ సెట్ అయ్యారు. ఆ బాధ నుంచి తట్టుకునేందుకు కొన్ని రోజుల పాటు ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. తిరిగి భారత్ కు వచ్చిన తర్వాత సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 2022లో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘లాల్ సింగ్ చద్దా - మూవీ తర్వాత వెంటనే మరో సినిమా చేయాలి అనుకున్నాను. ఆ సినిమాకు సంబంధించిన చక్కటి కథ, అద్భుతమైన స్క్రిప్ట్ రూపొందించుకున్నాం. కానీ, ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నా కుటుంబంతో, నా తల్లితో, నా పిల్లలతో ఉండాలనుకుంటున్నాను. కనీసం ఏడాదిన్నర పాటు ఏ సినిమా చేయకూడదు అనుకుంటున్నాను” అని చెప్పారు.
త్వరలో అమీర్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం
ప్రస్తుతం ఆయన మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో నటించేందుకు దాదాపు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎలాగైనా అమీర్ ను ఈ సినిమాలో నటించేలా చేయాలని ప్రశాంత్ నీల్ ఆసక్తిగా ఉన్నారట. అంతేకాదు, ఈ చిత్రంలో అమీర్ ను పవర్ ఫుల్ విలన్ గా చూపించేందుకు కథ రెడీ చేసుకున్నారట. అయితే, అమీర్ ఖాన్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. కానీ, అమీర్ కూడా ఈ సినిమాపై ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ హీరో, దర్శకులతో కలిసి పని చేయడం వల్ల ‘లాల్ సింగ్ చద్దా’ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విషయంలో అమీర్ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి కల్లా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
ఫుల్ స్వింగ్ లో జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్
నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడిగా ప్రశాంత్ నీల్ మంచి స్వింగ్ లో ఉన్నారు. జూ. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. అటు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్-2‘తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ద
Read Also: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?