News
News
X

Laal Singh Chaddha: చిరు, నాగ్, రాజమౌళిల కోసం 'లాల్ సింగ్ చద్దా' స్పెషల్ స్క్రీనింగ్!

ఆమిర్ ఖాన్ నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా స్పెషల్ ప్రీమియర్ ను హైదరాబాద్ లో వేశారు. 

FOLLOW US: 

ఆమీర్ ఖాన్ హీరోగా, యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే రిలీజ్ కావాల్సింది కానీ అనివార్య కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ఏప్రిల్ లో కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ అప్పుడు కూడా రాలేదు. ఫైనల్ గా ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. సినిమాలో పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ను హైదరాబాద్ లో వేశారు. ఆమిర్ ఖాన్ ఈ ప్రీమియర్ ను టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఎరేంజ్ చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సుకుమార్ లాంటి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరితో కలిసి ఆమిర్ ఖాన్ కూడా సినిమా చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక ఈ సినిమా టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్‌'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్‌' (2017) తీసిన అద్వైత్‌ చందన్‌ ఈ హిందీ వెర్షన్‌ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాకు ఎరిక్‌ రోత్‌, రచయిత అతుల్‌ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

Published at : 14 Jul 2022 05:55 PM (IST) Tags: chiranjeevi Rajamouli nagarjuna Aamir Khan Laal Singh Chaddha Laal Singh Chaddha premiere

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!