Aadi's Top Gear Teaser : ప్రాణం కోసం టాక్సీ డ్రైవర్ పరుగు - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'టాప్ గేర్' టీజర్
Top Gear Movie Teaser : ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సినిమా 'టాప్ గేర్'. హిట్ చిత్రాల దర్శకుడు మారుతి ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
![Aadi's Top Gear Teaser : ప్రాణం కోసం టాక్సీ డ్రైవర్ పరుగు - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'టాప్ గేర్' టీజర్ Aadi's Top Gear Teaser creates curiosity Watch Aadi Sai Kumar Riya Suman's Top Gear Teaser Movie Set To Release On Dec 30th Aadi's Top Gear Teaser : ప్రాణం కోసం టాక్సీ డ్రైవర్ పరుగు - ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'టాప్ గేర్' టీజర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/03/1645d2ba0b931cc4da2f71aeb50558751670050420119313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'టాప్ గేర్' (Top Gear Movie). ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకుడు. ఈ నెలాఖరున... డిసెంబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
'టాప్ గేర్' టీజర్ విడుదల చేసిన మారుతిప్రముఖ దర్శకుడు మారుతి ఈ రోజు 'టాప్ గేర్' టీజర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. టీజర్ చాలా చక్కగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని ఆయన అన్నారు.
Top Gear Movie Teaser Review : పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్'లో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారని దర్శక నిర్మాతలు ముందే వెల్లడించారు. టీజర్‌లో ఆయన టాక్సీ డ్రైవ్ చేస్తున్నట్లు చూపించారు. కార్ అద్దంలో ఒక్కొక్క క్యారెక్టర్ చూపించారు. ఆ తర్వాత హీరోకి అన్‌నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది.
'విధి రాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడు అన్నది ఎంత నిజమో... నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అన్నది కూడా అంతే నిజం' అని వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత కారులో వెనుక కూర్చున్న వ్యక్తి హీరోలో గన్ గురి పెడతారు. దాంతో టాప్ గేరు వేసి, స్పీడుగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అతడిని పోలీసులు ఎందుకు వెంబడించారు? వెనుక బైకులో ఫాలో అయిన వ్యక్తి ఎవరు? 'ఇప్పుడు రెండు ప్రాణాలు పోతాయ్!' అని మళ్ళీ వార్నింగ్ ఎందుకు వచ్చింది? అనేది సస్పెన్సులో ఉంచారు.
'టాప్ గేర్' టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందని, మంచి థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. ''అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు .
Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?
వెన్నెల... వెన్నెల... పెళ్లి తర్వాత పాట!
'టాప్ గేర్' చిత్రంలో ఆది సాయి కుమార్‌కు జంటగా రియా సుమన్ (Riya Suman) నటించారు. కథలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ సమయంలో వచ్చే 'వెన్నెల వెన్నెల...' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మధ్య ఆ పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆయన బాణీకి సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ సూపర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సైతం బావుందని చెబుతున్నారు.
బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)