Sabdam Movie Poster: ‘వైశాలి’ కాంబో రిపీట్ - ‘శబ్దం’తో వస్తున్న ఆది పినిశెట్టి, ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్!
ప్రస్తుతం ఆది నటిస్తోన్న సినిమా ‘శబ్దం’. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి మూవీ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
ఆది పినిశెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రకైనా సిద్దం అంటారు ఆది. అటు హీరో ఇటు విలన్ క్యారెక్టర్లను కూడా చాలా బ్యాలెన్సింగ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకొని తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటారు ఆది. ప్రస్తుతం ఆది నటిస్తోన్న సినిమా ‘శబ్దం’. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి మూవీ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ ఆదికు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు.
ఆది పినిశెట్టి 2009 లో వచ్చిన ‘వైశాలి’ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు లోనూ మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాను అగ్ర దర్శకుడు శంకర్ నిర్మాణంలో హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి అరివజగన్ దర్శకత్వం వహించారు. మరోసారి అరివజగన్, ఆది కాంబో లో సినిమా రాబోతోంది. అదే ‘శబ్ధం’. దీంతో దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయన ఆది ను డైరెక్ట్ చేయబోతున్నారు. సినిమా టైటిల్ కూడా చెవి గబ్బిలాల నేపథ్యంలో ఆకట్టుకునేలా ఉంది. అందుకే ఈ చిత్రం పై ఇప్పటినుంచే భారీ అంచానాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ పై మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ‘వైశాలి’ కంటే బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. ఇక ఈ ‘శబ్ధం’ కు ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘వైశాలి’ సినిమాకు కూడా థమన్ నే మ్యూజిక్ ను అందించారు. ‘వైశాలి’ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో కూాడా థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడని అంటున్నారు. ఈ ‘శబ్దం’ సినిమాను తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మూవీని కూడా హార్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ చిత్రాన్ని 7జీ ఫిలిమ్స్ అండ్ అల్ఫా ఫ్రేమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ ‘శబ్దం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి శబ్దం చేస్తుందో చూడాలి.
ఇక ఆది రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటించిన ‘ది వారియర్’ సినిమాలో విలన్ గా చేశారు. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నటన పరంగా ఆది కు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. సినిమాలో ఆది యాటిట్యూడ్, డైలాగ్స్ అలరిస్తాయి. అందుకే ఆది నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్దంగా ఉంటారు.
Also Read : టికెట్ రేట్స్ మీద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు - 'తారకరామ' థియేటర్ పునఃప్రారంభంలో నందమూరి నాయకుడు ఏమన్నారంటే?
View this post on Instagram