National Film Awards 2022: జాతీయ పురస్కార విజేతలు - 'కలర్ ఫోటో' సినిమాకి నేషనల్ అవార్డు, లిస్ట్ లో తమన్ కూడా!
68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కాసేపటి క్రితమే కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కాసేపటి క్రితమే కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది. ఈసారి దాదాపు నాలుగొందల సినిమాలు అవార్డుల కోసం పోటీ పడగా.. పదిహేను ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో 'కలర్ ఫోటో' సినిమాకి అవార్డు దక్కింది. అలానే ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్(అల వైకుంఠపురములో) కి అవార్డు దక్కింది.
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న విజేతల వివరాలు:
బెస్ట్ తెలుగు ఫిల్మ్- కలర్ ఫొటో
బెస్ట్ డ్యాన్స్- నాట్యం, సంధ్యా రాజు
బెస్ట్ సాంగ్స్ - అల వైకుంఠపురంలో
బెస్ట్ బీజీఎం- సూరారై పొట్రు
బెస్ట్ స్టంట్స్- అయ్యప్పనుమ్ కోషియమ్
బెస్ట్ మేకప్ - నాట్యం
బెస్ట్ స్క్రీన్ ప్లే- సూరారై పొట్రు
బెస్ట్ డైలాగ్స్- మండేలా
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- బిజు మీనన్
బెస్ట్ యాక్ట్రస్- అపర్ణ మురళి
బెస్ట్ యాక్టర్- సూర్య, అజయ్ దేవగణ్
బెస్ట్ డైరెక్టర్- సచ్చిదనందన్ కేఆర్
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్- సూరారై పొట్రు
View this post on Instagram