Warangal Election Results 2024: వరంగల్‌లో సునామీ రేపిన కాంగ్రెస్ - బీజేపీ, బీఆర్ఎస్ తర్వాతి స్థానాల్లో
Warangal Lok Sabha Election Results 2024: వరంగల్ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ కడియం కావ్య భారీ మెజారిటీ సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ రెండోస్థానానికి పరిమితం అయ్యారు.
Warangal Lok Sabha Elections 2024: వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ పై 220339 ఓట్ల మెజారిటీ సాధించారు. కడియం కావ్యకు 581294 ఓట్లు పోలయ్యాయి. ఆరూరి రమేశ్ కు 360955 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ మారపల్లి సునీల్ కుమార్ కు 232033 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య తొలి నుంచి ముందంజలో దూసుకుపోయారు. ఉదయం 11 గంటల సమయానికి ఈమెకు 375701 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ 136376 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ 222363 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోగా.. ప్రతి చోటా మూడో స్థానంలో నిలిచింది.