అన్వేషించండి

Vijayawada East: విజయవాడ తూర్పున ఉదయించేదెవరో..? టీడీపీ మళ్లీ 'గద్దె'నెక్కేనా? సభలో దేవినేని కుటుంబానికి చోటు దక్కేనా?

Andhra Pradesh Elections : కాంగ్రెస్‌ గడ్డపై పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం పోరాటం చేస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు గద్దె తహతహలాడుతుండగా...బోణీ చేసేందుకు వైసీపీ ఎదురుచూస్తోంది.

Vijayawada East Assembly Constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తూర్పు నియోజకవర్గాన్ని 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. విజయవాడ‍(Vijayawada) నగరపాలక సంస్థలోని వార్డులతోపాటు అర్బన్ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్‌(Congress) పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో  తెలుగుదేశం(Telugu Desam) పార్టీ పట్టు సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌(Gadde Rammohan) రెండోసారి ఎమ్మెల్యేగా  ఇక్కడ నుంచే కొనసాగుతున్నారు. 

విజయవాడ తూర్పు ఎవరిదో..?
విజయవాడ తూర్పు(Vijayawada East) నియోజకవర్గం 1967లో ఏర్పాటు చేసినా 2007లో జరిగిన పునర్విభజనలో  పేరు మాత్రం అలాగే ఉంచి...నియోజకవర్గ  స్వరూపం మొత్తం మార్చేశారు. గతంలో కంకిపాడు(Kankipadu) నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ  ఇప్పుడు విజయవాడ తూర్పులో కలిపేశారు. విజయవాడలోని అత్యంత కీలమైన బందర్‌రోడ్డు, ఆటోనగర్‌, మేజర్ కాలనీలు , హెల్త్‌ యూనివర్సిటీలు, కీలకమైన కళాశాలు ఉన్నాయి. 1967లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) తరపున నిల్చున్న తెన్నేటి వి.ఎస్‌.సి.ఆర్  గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ  కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకుంది. 1972లో జరిగిన ఎన్నికల్లో దమ్మాలపాటి రామారావు  గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskar Rao)  గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా  ఎన్టీఆర్(NTR) గాలి వీచింది. 1983లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అడుసుమిల్లి జయప్రకాశ్‌రావు (Adusumilli Jayaprakash Rao) జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత విజయవాడలో  వరుస హత్యలు, తదనంతర పరిణామాలతో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన వంగవీటి రంగా(Vangaveeti Ranga)కు 1985లో విజయవాడ తూర్పు టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందగా....ప్రత్యర్థుల దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో రంగా భార్య రత్నకుమారికి కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించగా...ఆమె విజయం సాధించారు. 1994లో రాష్ట్రవ్యాప్తంగా  తెలుగుదేశం(Telugu Desam) గాలి వీచినా....విజయవాడ తూర్పులో మాత్రం మరోసారి వంగవీటి రత్నకుమారి(Vangaveeti Ratna Kumari) కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీ(BJP)కి కేటాయించడంతో ఆ పార్టీ నుంచి సినీనటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao)  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2004లో జరిగిన ఎన్నికల్లో వంగవీటి రంగా కుమారుడు రాధా(Vangaveeti Radha)కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తండ్రీ, తల్లీ, కుమారుడు ముగ్గురు విజయం సాధించడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కంకిపాడు రద్దవ్వడం...ఆ నియోజకవర్గంలోని చాలా ప్రాంత విజయవాడ తూర్పులో కలవడంతో కాంగ్రెస్‌లో చేరిన దేవినేని నెహ్రూ (Devineni Nehru) విజయవాడ తూర్పు టిక్కెట్ దక్కించుకున్నారు . తెలుగుదేశం నుంచి గద్దెరామ్మోహన్ బరిలో దిగగా...ప్రజారాజ్యం(Prajarajyam) నుంచి టిక్కెట్ సాధించిన యలమంచలి రవి(Yalamanchili Ravi) కేవలం 190 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి గద్దె రామ్మోహన్‌ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధాపై విజయం సాధించారు. 2019 జరిగిన ఎన్నికల్లో రెండోసారి గద్దెరామ్మోహన్ విజయవాడ తూర్పు నుంచి గెలుపొందారు. వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరగా...వైసీపీ టిక్కెట్ బొప్పన భవకుమార్ దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గద్దెరామ్మోహన్....మరోసారి విజయవాడ తూర్పు నుంచే తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో ఉండగా....తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన మాజీమంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌(Devineni Avinash) ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. గతంలో అవినాష్‌ తండ్రీ ఐదుసార్లు ఇదే ప్రాంతం నుంచి గెలిపొంది ఉండటంతో  నియోజకవర్గ వ్యాప్తంగా దేవినేనికి అనుచరులు ఉండటంతో గెలుపై ఆయన దీమాగా ఉండగా....రెండుసార్లు ఎమ్మెల్యేగా  నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని గద్దె రామ్మోహన్ చెబుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరు గెలిచారు. 

ఎప్పుడు  ఎవరు పార్టీ 
1967 తెన్నేటి వి.ఎస్‌.సి.ఆర్ కాంగ్రెస్‌
1972 దమ్మాలపాటి రామారావు కాంగ్రెస్‌
1978 నాదెండ్ల భాస్కర్‌రావు కాంగ్రెస్‌
1983 అడుసుమిల్లి జయప్రకాశ్‌రావు టీడీపీ
1985 వంగవీటి రంగా కాంగ్రెస్‌
1989 రత్నకుమారి కాంగ్రెస్‌
1994 రత్నకుమారి కాంగ్రెస్‌
1999 కోట శ్రీనివాసరావు టీడీపీ
2004 వంగవీటి రాధా కాంగ్రెస్‌
2009  యలమంచలి రవి ప్రజారాజ్యం
2014 గద్దె రామ్మోహన్‌  టీడీపీ
2019 గద్దె రామ్మోహన్‌  టీడీపీ
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget