UP Election 2022: 'ఆఫ్ట్రాల్ కాదు సర్- 'సైకిల్'ను అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే'
ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రచార సభలో చేసిన 'సైకిల్' వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. సైకిల్ సామాన్యుల సవారీగా పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. భాజపా, సమాజ్‌వాదీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల.. సైకిల్ గుర్తుపై చేసిన విమర్శలకు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
खेत और किसान को जोड़ कर उसकी समृद्धि की नींव रखती है, हमारी साइकल,
— Akhilesh Yadav (@yadavakhilesh) February 20, 2022
सामाजिक बंधनों को तोड़ बिटिया को स्कूल छोड़ती है, हमारी साइकल
महंगाई का उसपर असर नहीं, वो सरपट दौड़ती है, हमारी साइकल,
साइकल आम जनों का विमान है, ग्रामीण भारत का अभिमान है, साइकल का अपमान पूरे देश का अपमान है। pic.twitter.com/Nf1Bq2XtjE
సైకిల్‌పై విమర్శలు
యూపీలోని హర్దోయ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తీర్పు వచ్చిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల ఘటన గురించి మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'ను ప్రస్తావించారు. 2008లో జరిగిన పేలుళ్లకు ఉగ్రవాదులు సైకిళ్లను వినియోగించారని, వారు సైకిళ్లను ఎందుకు ఎంచుకున్నారో ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటూ ఎస్పీ గుర్తుకు అన్వయించే ప్రయత్నం చేశారు.
బాంబు దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని మోదీ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన కొన్ని ఉగ్రదాడులకు కారణమైన వారిపై కేసులను కొట్టివేయాలని అప్పటి సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించినట్లు మోదీ అన్నారు.
Also Read: Fodder Scam Case: లాలూకు ఐదేళ్లు జైలు శిక్ష- దాణా కుంభకోణం కేసులో కోర్టు తీర్పు