Anti-BJP Front: కేసీఆర్- ఠాక్రే భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు- కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ ఫ్రంట్‌కు ఊఊ!
కేసీఆర్- ఉద్ధవ్ ఠాక్రే భేటీపై శివసేన తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంపై ఎలాంటి చర్చ చేయలేదని ఆయన అన్నారు. యాంటీ భాజపా పక్షాలను ఏకం చేయడమే ఆ చర్చ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిపి ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రభుత్వానికి శివసేన నేతృత్వం వహిస్తోంది. భాజపాయేతర పక్షాలను ఏకం చేసి ఓ రాజకీయ వేదికను ఏర్పాటు చేసే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల చర్చించారు.
ఈ సమావేశానికి సంజయ్ రౌత్ సహా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం గురించి శివసేన అధికారిక పత్రిక 'సామ్నా' ఆదివారం ఆర్టికల్ ప్రచురించింది. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఇద్దరు సీఎంల మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందని పేర్కొంది.
కేసీఆర్ వరుస చర్చలు
సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసంలో పవార్‌తో చర్చించారు. ఈ సమావేశంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని, దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై వీరు చర్చించారు.
Also Read: Shivamogga Murder: భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య- 'హిజాబ్' వేళ మరో ఘటన
Also Read: Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 16 వేల కేసులు