అన్వేషించండి

First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్‌ వేరే లెవల్‌- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది 

Telangana Election Results Highlights : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 50 మందికిపైగా సభ్యులు తొలిసారిగా సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇందులో గతంలో ఎంపీగా గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు.

Telangana Election Results Highlights: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 50 మందికిపైగా సభ్యులు తొలిసారిగా సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇందులో గతంలో ఎంపీగా గెలిచిన వాళ్లు కూడా ఉన్నారు. దీంతోపాటు 30 ఏళ్లు నిండని యువత కూడా ఉంది. ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి సభలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు. కాంగ్రెస్ నుంచి 34 మంది సభలో తొలిసారిగా అధ్యక్షా అనబోతున్నారు. బీఆర్‌ఎస్ నుంది పది మంది మాత్రమే తొలిసారి అసెంబ్లీ కూర్చోనున్నారు. బీజేపీ నుంచి మొత్తం 8 మంది గెలిస్తే అందులో ఏడుగురు తొలిసారిగా సభలోకి రానున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. 
మొదటిసారి సభలో అడుగు  పెట్టనున్న ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన సభ్యులు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(పాలేరు)
పొన్నం ప్రభాకర్‌(హుస్నాబాద్‌)
వివేక్‌ వెంకట స్వామి(చెన్నూర్‌)
జయవీర్‌రెడ్డి(నాగార్జున సాగర్‌) జానారెడ్డి కుమారుడు 
మైనంపల్లి రోహిత్‌(మెదక్‌)- మైనంపల్లి హనుమంత రావు కుమారుడు
పర్ణికారెడ్డి(నారాయణపేట)
తూడి మేఘారెడ్డి(వనపర్తి)
మట్టా రాగమయి(సత్తుపల్లి)
యశస్విని రెడ్డి (పాలకుర్తి)
అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి)
వాకిటి శ్రీహరి(మక్తల్)
మధుసూదన్ రెడ్డి(దేవరకద్ర)
అనిరుధ్‌ రెడ్డి(జడ్చర్ల)
నారాయణ రెడ్డి(కల్వకుర్తి)
ఆది శ్రీనివాస్(వేములవాడ)
సత్యనారాయణ(మానకొండూరు)
రాజ్‌ఠాకూర్‌(రామగుండం)
మేడిపల్లి సత్యం(చొప్పదండి)
భూపతి  రెడ్డి(నిజామాబాద్‌ రూరల్‌)
లక్ష్మీకాంతారావు(జుక్కల్)
మదన్ మోహన్ రావు(ఎల్లారెడ్డి)
మనోహర్‌ రెడ్డి(తాండూరు)
ప్రేమ్‌సాగర్‌రావు(మంచిర్యాల)
బీర్ల ఐలయ్య(ఆలేరు)
వెడ్మా బొజ్జు(ఖానాపూర్)
కుంభం అనిల్‌ రెడ్డి(భువనగిరి)
బత్తుల లక్ష్మారెడ్డి(మిర్యాలగూడ)
మందల శామ్యేల్‌ (తుంగతుర్తి)
రాందాస్‌ నాయక్‌(వైరా)
ఆదినారాయణ(అశ్వరావుపేట)
కేఆర్‌ నాగరాజు(వర్ధన్నపేట)
రాంచంద్రునాయక్‌(డోర్నకల్‌)
మురళీనాయక్‌(మహబూబాబాద్‌)
నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్‌ పశ్చిమ)

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన సభ్యులు
పాడి కౌశిక్‌ రెడ్డి(హుజూరాబాద్)
పల్లా రాజేశ్వర్‌ రెడ్డి(జనగామ)
కొత్త ప్రభాకర్ రెడ్డి(దుబ్బాక)
లాస్య నందిత(సికింద్రాబాద్‌)
విజేయుడు(అలంపూర్‌)
సంజయ్‌ (కోరుట్ల)
మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజిగిరి)
లక్ష్మారెడ్డి(ఉప్పల్)
అనిల్‌ జాదవ్‌(బోథ్‌)
తెల్లం వెంకట్రావు(భద్రాచలం)

బీజేపీ నుంచి గెలిచిన సభ్యులు
వెంకటరమణారెడ్డి(కామారెడ్డి)
రాకేశ్‌రెడ్డి(ఆర్మూర్‌)
సూర్యనారాయణ గుప్తా(నిజామాబాద్‌ అర్బన్)
పాల్వాయి హరీష్‌(సిర్పూర్‌)
పాయల్ శంకర్‌(ఆదిలాబాద్)
రామారావుపటేల్‌(ముథోల్‌)
గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి)

ఈసారి తెలంగాణ అసెంబ్లీ యువగళం బాగానే ఉంది. ముగ్గురు సభ్యులు అత్యంత చిన్న వయసు వారిగా రికార్డుల్లోకి ఎక్కారు. పాలకుర్తి  నుంచి ఎర్రబెల్లిపై విజయం సాధించిన యశస్విని రెడ్డి 26 ఏళ్లకే సభలో అడుగు పెట్టబోతున్నారు. మెదక్ నుంచి గెలిచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్‌ కూడా 26 ఏళ్లకే ఎమ్మెల్యే అవుతున్నారు. నారాయణపేట నుంచి విజయం సాధించిన పర్ణికారెడ్డి వయసు 30 ఏళ్లే. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నుంచి విజయం సాధించిన లాస్య నందిత వయసు 36 ఏళ్లు. 

డాక్టర్ ఎమ్మెల్యేలు వీరే
వీళ్లతోపాటు ఈసారి రికార్డు స్థాయిలో 15 మంది వైద్యులు సభలోకి అడుగు పెట్టబోతున్నారు. నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేకుల డాక్టర్ భూపతి రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ పై గెలుపొందారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, నాగర్ కర్నూల్ నుంచి రాజేశ్ రెడ్డి, మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై గెలుపొందారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్, ప్రణీతారెడ్డి (నారాయణపేట), సిర్పూర్ లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ విజయం సాధించారు. సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, డోర్నకల్ నుంచి రామచందర్ నాయక్ (కాంగ్రెస్), నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి (కాంగ్రెస్), మానకొండూరు నుంచి డాక్టర్ సత్యనారాయణ, భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు, అచ్చంపేటలో వంశీకృష్ణ (కాంగ్రెస్), చెన్నూర్ లో డాక్టర్ వెంకటస్వామి (కాంగ్రెస్), జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ (బీఆర్ఎస్) గా విజయం సాధించారు. వైద్యులుగా సేవలందించిన, అందిస్తున్న వీరు ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు.

వీళ్లతోపాటు ఇంజినీరింగ్ చేసిన గంగుల కమలాకర్‌, వివేకానంద్‌ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, యశస్విని రెడ్డి సభలోకి వస్తున్నారు. ప్రభుత్వ కొలువుల్లో పని చేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వెడ్మా బొజ్జు,జారే ఆదినారాయణ, మాణిక్‌రావు గెలుపొందారు. విద్యాసంస్థల అధినేతలైన మర్రి రాజశేఖర్‌్రెడ్డి, మల్లారెడ్డి, పల్లారాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నారాయమ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉన్నారు. కాలేరు వెంకటేష్‌, జగదీశ్‌ రెడ్డి లాయర్లు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget