TDP MP as Speaker of Lok Sabha : లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి టీడీపీ ఎంపీ - చంద్రబాబు డీల్ సెట్ చేసుకోబోతున్నారా ?
Election Results 2024 : లోక్‌సభ స్పీకర్‌గా టీడీపీ ఎంపీ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
TDP MP will be finalized as Speaker of Lok Sabha Chandrababu Plan : కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడం ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు వరంగా మారనుంది. ఆ పార్టీలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు సిద్ధపడుతున్నాయి. బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ టీడీపీ. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో కీలకమైన పదవులు అడగనున్నట్లుగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర కేబినెట్ పదవుల కన్నా ముందు ఆయన లోక్ సభ స్పీకర్ పదవిని అడగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
స్పీకర్ పదవి కోసం పట్టుబట్టనున్న చంద్రబాబు
గతంలో వాజ్ పేయి హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో గంటి మోహన చంద్ర బాలయోగి లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు. పూర్తిగా ఓ ప్రాంతీయ పార్టీ ఎంపీ స్పీకర్ గా ఉండటం అదే మొదటి సారి. ఇప్పుడు మరోసారి స్పీకర్ గా టీడీపీ నేతను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. కూటమి రాజకీయాల్లో స్పీకర్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు తమ పార్టీ నేతను స్పీకర్ గా ఉండేలా చూడాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కూటమిగా మారడం - స్మూత్‌గా ఓట్ల బదిలీ ! ఇదే అసలు గేమ్ ఛేంజర్ !
రామ్మోహన్ నాయుడుకు చాన్స్ ఉంటుందా ?
ఇప్పుడు జీఎంసీ బాలయోగి కుమారుడు ఎంపీగా ఉన్నారు. అ యితే ఆయన మొదటి సారి ఎంపీ కాబట్టి స్పీకర్ అయ్యే అవకాశం లేదు. సీనియర్ నేతల్లో రామ్మోహన్ నాయుడు మూడో సారి ఎంపీ అయ్యారు. యువ నేత ను స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. అన్ని విషయాలపై సంపూర్ణమైన అవగాహన ఉన్న నేతగా రామ్మోహన్ నాయుడుకు పేరుంది. పైగా అన్ని భాషల్లోనూ మంచి పట్టు ఉంది. మిగతా ఎంపీలు అంతా పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేని వాళ్లే.
ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం- ఇండీ కూటమిలో చేరికపై చంద్రబాబు స్పందన
కేంద్ర మంత్రి పదవలకూ మొదటి పేరు రామ్మోహన్ నాయుడిదే !
ఎన్డీఏ ప్రభుత్వలో టీడీపీ చేరడం ఖాయమే. స్పీకర్ పదవి తీసుకోకపోయినా కేబినెట్ మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తాయి. ఆ విషయంలో మొదటి పేరు రామ్మోహన్ నాయుడుది అవుతుంది. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీకి కూడా రామ్మోహన్ నాయుడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎన్నికలకు ముందు యువ ఎంపీలతో ఆయన విందు నిర్వహించారు. ఆ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు.