అన్వేషించండి

Andhra Election Results 2024 : కూటమిగా మారడం - స్మూత్‌గా ఓట్ల బదిలీ ! ఇదే అసలు గేమ్ ఛేంజర్ !

NDA Alliance Victory : జగన్ వ్యతిరేకులంతా ఓ వైపు కూటమిగా మారితే .. తల్లిని కూడా దూరం చేసుకున్న జగన్ ఒంటరిగా మారారు. ఆ ఫలితమే ఈ ఘోర పరాజయం. కూటమి ఓట్ల బదిలీ సాఫీగా సాగిపపోవడం విజయంలో ప్రధాన పాత్ర.

NDA Alliance Victory in Andhra Elections :   చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జోస్యం చెప్పారు. చంద్రబాబు దురదృష్టం ఏమిటో కానీ ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా పరాజయం పాలయ్యారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా పరాజయం పాలయ్యారు అది వేరే విషయం. కానీ గెలిచినప్పుడల్లా పొత్తులు ఉన్నాయి. అప్పట్లో మోదీ చెప్పింది నిజమైంది. కానీ 2024 నాటికి మళ్లీ పొత్తులతో తెరపైకి వచ్చారు.  భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

కూటమిగా ఏర్పడటమే టీడీపీకి కీలకం  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  పొలిటికల్ వ్యూహాల గురించి మాటల్లో చెప్పలేం. గెలుస్తారా.. ఓడుతారా అన్న దానితో సంబంధం లేకుండా క్లాస్ పాలిటిక్స్ చేయడంలో ఆయన స్టైలే వేరు. తన క్లాస్ ను ఏపీ ఎన్నికల్లో మరోసారి చూపించారు. బీజేపీ, జనసేనతో  పొత్తులు పెట్టుకోడమే కాదు...ఓట్లు ఈజీగా ట్రాన్స్ ఫర్ అయ్యే వాతావరణం తీసుకు వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూడు పార్టీలు ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ భిన్నమైన అభిప్రాయాలతో పోరాడాయి. ఎన్నికలకు ఏడాది ముందు జనసేన పార్టీ ఓట్ల చీలిక జరగనివ్వబోమని చెబుతూ ముందుకు వచ్చినప్పటి నుండి పరిస్థితి మారింది. కూటమిగా మారిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన సానుభూతిపరులుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న అనేక మంది కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారు. తక్కువ సీట్లు తీసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య దూషణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక బీజేపీ పూర్తిగా వేరే ట్రాక్‌లో ఉండేది. ఆ పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఉండేవారు. అందుకే ఆ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది పెద్ద పజిల్ గా ఉండేది. 

చెప్పి మరీ కొట్టిన పవన్ కల్యాణ్- పవర్ సునామీ తలుపులు తడితే అలానే ఉంటుంది!

స్మూత్‌గా ఓట్ల  బదిలీ జరిగేలా వ్యూహం 
                       
ఏపీలో ఎన్డీఏ కూటమి ఓట్ల బదిలీ జరిగితేనే మంచి ఫలితాలు సాధిస్తుందని మూడు పార్టీల నేతలకూ తెలుసు.  బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేసింది. జనసేన రెండు పార్లమెంట్, ఇరవై  ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి.  టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. అంటే..  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా మూడు పార్టీలపై ఓటర్లలో స్పష్టమన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో గాజు గ్లాస్ గుర్తు గందరగోళం కూడా వచ్చింది. కానీ ఒక్క సారి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలు కనిపించలేదు. స్మూత్ గా ప్రచారం చేసుకుపోయారు. మూడు పార్టీల మధ్య వివాదాలు సృష్టించాలని వైసీపీ వైపు నుంచి కొన్ని వ్యూహాలు అమలయ్యాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం విషయంలో అనేక పుకార్లు కూడా రేపారు. అయితే ఏదీ  నిలబడలేదు. అంతా సాఫీగా సాగిపోయింది. 

కసితో పని చేసిన కూటమి పార్టీలు
                      
కోస్తా జిల్లాల్లో ఓట్ల బదిలీ ఎంత పర్ ఫెక్ట్ గా జరిగింతో ఫలితాలు చూస్తే అర్థమైపోతుంది.  ఎంత  బాగా కలసిపోతే అంత బాగా ఫలితాలు వస్తాయనే   విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రచారం ఉమ్మడిగా సాగింది. ప్రతి మూడు రోజులకు ఓ సారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు. కూటమిలో ఏ గుర్తుకు ఓటు వేసినా తమ అభిమాన పార్టీకి వేసినట్లే అన్న అభిప్రాయాన్ని వంద శాతం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పాటు మూడు సభలు, ఓ రోడ్ షోలో పాల్గొన్నారు. పార్టీలు పూర్తిగా కలసిపోయాయన్న గట్టి నమ్మకాన్ని ఓటర్లలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ప్రచారం పూర్తయ్యే సరికి అన్ని పార్టీల కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసిపోయారు. బరిలో ఉన్నది తమ పార్టీ అభ్యర్థా కాదా అన్నది చూసులేదు..   కూటమి అభ్యర్థి కోసం పోటీ పడాలన్నదే లక్ష్యంగా పని చేశారు. అనుకున్న ఫలితం సాధించారు. 

25కుపైగా స్థానాల్లో జగన్‌ టీంను దెబ్బ తీసిన షర్మిల జట్టు- కాంగ్రెస్‌పై సిక్కోలు వాసులకు ఎందుకంత కసి!

కలసికట్టుగానే ఎలక్షనీరింగ్ 
                
ఎలక్షనీరింగ్ అత్యంత కీలకం.  . ఈ విషయంలో కూటమిలో అన్ని   పార్టీల కన్నా.. టీడీపీపై ఎక్కువ బాధ్యత తీసుకుంది.   ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామ స్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీనే. జనసేన పార్టీకి అంతర్గత నిర్మాణం లేదు. బీజేపీకి క్యాడరగ్ తో పాటు కార్యకర్తలూ తక్కువే అందుకే ఈ పార్టీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ బాధ్యతలు టీడీపీనే  తీసుకుంది.  జనసేన సానుభూతిపరుల్ని పూర్తి స్థాయిలో ఓటింగ్ కు వచ్చేలా చూసుకుంది.  ఈ విషయంలో చంద్రబాబు తనదైన మార్క్ చూపించారు.  కూటమికి భారీ విజయాలు ఖాయమ్యాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget