అన్వేషించండి

Srikakulam News: అనుకున్నదొకటి అయినదొక్కటి- షాక్‌ ఇచ్చిందిలే అధిష్ఠానం !

Srikakulam News: ఒకే స్థానం కోసం ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. అధినాయకత్వం మాత్రం ఇద్దరిని చెరో స్థానానికి పంపించింది.

Andhra Pradesh News: టీడీపీ విడుదల చేసిన లాస్ట్ లిస్ట్‌తో చాలా నియోజకవర్గాల్లో సస్పెన్స్‌కు తెరపడినట్టు అయింది. అయితే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటి వరకు ఉన్న గ్రూపుల గోల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఇప్పటి వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతలు టికెట్ కోసం పోటీ పడ్డారు. కళా వెంకట్రావు ఒకవైపు, కలిశెట్టిఅప్పలనాయుడు ఇంతకాలం పోటీ పడ్డారు. చివరికి ఇప్పుడు ఆ స్థానం బీజేపీకి వెళ్లిపోయింది. వీళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇద్దరు నేతలు పూర్తిగా డీలాపడిపోయారు. అయితే అధినాయకత్వం వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. 

ఎచ్చెర్ల టికెట్ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ స్థానం ఇచ్చింది. చీపురుపల్లి నుంచి కళావెంకట్రావుకు ఛాన్స్‌ ఇచ్చింది. ఒకే స్థానం కోసం పోటీ పడుతున్న ఇరు వర్గాలకు రెండు వేర్వేరు స్థానాలు ఇచ్చి ఇద్దరూ కలిసి పని చేసేలా ప్లాన్ చేసింది. ఈ ఇద్దరు తూర్పుకాపునేతలు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం కోసం గత కొంత కాలంగా ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ఇద్దరికీ విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న స్థానాలు కేటాయించడంతో ఒకరి కోసం మరొకరు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చిపురుపల్లిలో బొత్సపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న కళావెంకట్రావు తమ్ముడు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాడని భావించి కళా వెంకట్రావును అక్కడకు పంపించారు. వీళ్లు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కావడంతో సమన్వయం కూడా ఉంటుందని అధినాయకత్వం ఆలోచన. చీపురుపల్లి నియోజకవర్గంలో కిమిడి నాగార్జునకి ఇస్తారు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కళా వెంకట్రావు పేరు రావడంతో స్థానిక నాయకత్వం కొంత వ్యతిరేకంగా ఉంది.ఎచ్చెర్లలో ఉంటున్న అభ్యర్థికి చీపురుపల్లి సీటు ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నాగార్జునతోపాటు అనుచరులు టీడీపీకి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది కళాకు కాస్త తలనొప్పి వ్యవహారంగానే కనిపిస్తోంది. 

విజయనగరం ఎంపిగా కలిశెట్టి అప్పలనాయుడుకి అధినేత చంద్రబాబు అవకాశం కల్పించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి కేటాయించడంపై ఆయన వర్గీయుల్లో నిరాశ కనిపిస్తోంది. మొదట విజయనగరం పార్లమెంట్ స్థానం కళా పేరునే పరిశీలించింది. అయితే ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మీసాలగీత, కంది చంద్రశేఖర్, కలిశెట్టి అప్పలనాయుడు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. చివరకు అప్పలనాయుడుని ఖరారు చేశారు. చీపురుపల్లి స్థానానికి కూడా గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావును పరిశీలించారు. చివరకు కళా వెంకటరావుకి కేటాయించారు. 

అప్పలనాయడు విషయంలో ఎలాంటి వ్యతిరేకత కనిపించకపోయినప్పటికీ కళావెంకట్రావు విషయంలో కనిపిస్తున్న వ్యతిరేకతను అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో అన్నఆసక్తి కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget