అన్వేషించండి

Lokesh Comments On Jagan: జగన్‌కు చిప్ పోయింది, కుర్చీ మడత పెట్టేందుకు ప్రజలు రెడీ అన్న లోకేష్

Nara Lokesh News: సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు చిప్ పోయిందని లోకేష్ విమర్శించారు.

Nara Lokesh Comments On Jagan : సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మండుటెండలో కార్యకర్తలను సెల్ఫోన్ టార్చ్ ఆన్ చేయమంటూ చెప్పిన జగన్ కు చిప్ పోయిందని.. జగన్ చెప్పిన మాటలతో కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని లోకేష్ విమర్శించారు. విశాఖ నగర పరిధి ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలపై తీవ్రస్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్ర ఊపు అదిరిందని, . ఇక్కడి జీవితాలతో జగన్ ఓ ఆట ఆడారని,  రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటారని లోకేష్‌ అభిప్రాయపడ్డారు. పౌరుషాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర అని, ఏపీకే కాకుండా దేశానికే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ అని లోకేష్ పేర్కొన్నారు.  చంద్రబాబు విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే... గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా జగన్  మార్చారన్న లోకేష్.. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్, విధ్వంసం, మర్డర్, రోజుకో భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. 

సైకిల్ గ్లాస్ విలువ పెత్తందారులకు అర్థం కాదన్న లోకేష్

సిద్ధం సభ వేదికగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లోకేష్ తిప్పి కొట్టారు. సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదని, సైకిల్ సామాన్యుడి చైతన్య రథమని, గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ యువతను దగా చేసిన ఈ ప్రభుత్వానికి అదే యువత తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని లోకేష్ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడిందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారని, అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్త బుట్టలో పడేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారని, జలయజ్ఞం పేరు చెప్పి తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. .

అడుగడుగునా మోసం చేసిన జగన్

సంక్షేమ పథకాల అమలు విషయంలో అడుగడుగునా ప్రజలను మోసం చేసుకుంటూ జగన్ వస్తున్నాడని లోకేష్ విమర్శించారు. వందకు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. వై నాట్ 175 అంటున్నారని, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అని తాను అంటున్నానని, వీటిపై జగన్ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారని, కానీ సొంత తల్లి, చెల్లి కూడా నమ్మడం లేని వ్యక్తిని మనం ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని,  బల్లపైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో పది వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో వంద లాగేస్తున్నారని లోకేష్ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాల అమలతో అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1400 పీహెచ్డీ సీట్లు అమ్ముకున్నారని, విసి ప్రసాదరెడ్డి పేరు ఎర్రబుక్ లో రాసుకున్నా అని లోకేశ్ స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget