అన్వేషించండి

ABP Special interview with Sharmala : అన్నింటికీ జగనే కారణం - న్యాయం కోసమే పోరాటం - షర్మిలతో ఏబీపీ ఎక్స్‌క్లూజివ్

Sharmila Special Interview : పదవుల కోసం కాదని న్యాయం కోసమే పోరాడుతున్నామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ABP Exclusive Interview with Sharmila :  వైఎస్ కుటుంబంలో వచ్చిన  చీలికకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే బాధ్యుడని.. అలా చేయడానికి ఆయనకు ఎవరి సాయం అక్కర్లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు సీఎంగా ఉండగా ఆయన కుమార్తె కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి రాజకీయ పోరాటం చేస్తున్నారు. దీనంతటికి కారణం వైఎస్ వివేకా  హత్య కేసు. ఆ హత్య వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని సీబీఐ తేల్చినా జగన్ వెనకేసుకు వస్తున్నాడని .. అందుకే న్యాయం కోసం తాము  తిరగబడ్డామని అంటున్నారు. షర్మిలతో ఏబీపీ దేశం ఎడిటర్ జి.వి.నాగేశ్ జరిపిన  ఇంటర్యూలో కీలక విషయాలు ఇవి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను కాను  రాజకీయాలకు కొత్త కాదు !

రాజకీయ కుటుంబంలో పుట్టిన షర్మిల తనకు  రాజకీయాలు కొత్త కాదని గుర్తు చేశారు. నేరుగా బాధ్యతలు తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మాత్రమే కొత్తగానే ఉందని..  కానీ ప్రజలను కలవడం, ప్రచారం చేయడం, సమస్యలపై మాట్లాడటం కొత్త కాదని గుర్తు  చేసుకున్నారు. కడపలో వైఎస్ కుటుంబమే గెలుస్తుందని.. తానే గెలుస్తానని స్పష్టం చేశారు.  ఇది న్యాయానికి సంబంధించిన పోరాటం. న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ అడుగు పెట్టబోతున్నానని గర్వంగా ఉందన్నారు. 

పదవుల రాజకీయం కాదు - న్యాయం కోసం పోరాటం 

తాను ఎంపీ అవ్వాలనో సీఎం అవ్వాలనో రాజకీయం చేయడం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా నేను నిలబడతానని అనుకోలేదు. కానీ నిలబడాల్సి వచ్చింది. ఎందుకంటే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డినే నిలబెట్టాలని జగన్ మోహన్ రెడ్డి భావించారు కాబట్టి... అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు చట్టసభలకు వెళ్లకూడదని, ఇచ్చిన అధికారాన్ని తప్పించుకోవడానికి వాడకూడదని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ పార్టీని కూడా దీని కోసం ఒప్పించాల్సి వచ్చిందని షర్మిల తెలిపారు 

రాజకయాల్లోకి తెచ్చింది జగనే !

తనకు అసలు రాజకీయ ఆలోచనలే లేవని షర్మిల స్పష్టం చేశారు.  నిజం మాట్లాడుకుంటే ఆ రోజు జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది కాబట్టి, అవసరం అయింది కాబట్టి ఆరోజు నేను అమ్మ బయటకు వచ్చాం. అలా రావడంలో నా ఇంట్రెస్టు లేదు. పాదయాత్రపై కూడా ఇంట్రెస్టు లేదు. సమైక్యాంధ్ర కోసం చేసిన యాత్రలో నా ఇంట్రెస్టు లేదు. బైబై బాబు క్యాంపెయిన్ ఇలా అవసరమైనప్పుడల్లా నన్న ఉపయోగించుకున్నారు. వాళ్లు అడిగారని నేను కూడా చేశాను. నాకు పొలిటికల్ యాంబిషన్ ఉంటే పార్టీలో ఒక పోస్టు అయినా తీసుకోకపోయేదాన్నా, లేకపోతే పదవి అయినా తీసుకోకపోయేదాన్న అని షర్మిల గుర్తు చేసుకున్నారు.   రాజ్యసభ, ఎంపీ సీటు అయిన అడక్కపోయేదాన్నా. నా కంటూ యాంబిషన్ ఉండి ఉంటే 2019లో నేనే పోటీ చేయాలని వివేకనందరెడ్డి పట్టు పట్టారన్నారు. 

పొలిటికల్ యాంబిషన్‌తో తెలంగాణలో పార్టీ పెట్టలేదు ! 
 
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రాజశేఖర్ రెడ్డి మైండ్‌లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వేర్వేరు కాదు. అందరూ తన బిడ్డలే. కాబట్టి అక్కడ ఉన్నందుకు అన్యాయం జరుగుతున్నందుకు దిగాల్సి వచ్చింది. ఆల్ట్రనేటివ్ లేనందునే రెండోసారి కేసీఆర్ గెలిచారు. అప్పటికి కాంగ్రెస్ పుంజుకోలేదు. ప్రత్యామ్నాయం ఉండాలని చెప్పి అక్కడ నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది. అది కూడా పొలిటికల్ యాంబిషన్‌తో చేసింది కాదు.  అక్కడైనా ఇక్కడైనా ప్రజలపై నాకు బాధ్యత ఉంది కాబట్టి వచ్చాను. నాకే పొలిటికల్ యాంబిషన్ ఉండి ఉంటే తెలంగాణలో ఎందుకు పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు హెల్ప్ చేస్తాను. అంత కష్టపడి పోటీ చేయకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చకూడదని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. నాకు పొలిటికల్ యాంబిషన్ ఉండి ఉంటే ఇక్కడే పార్టీ పెట్టేదాన్ని. ఈయన(జగన్‌)కు ఇష్టం లేదని తెలిసే అక్కడు వెళ్లాను. చివరకు అక్కడ ఓ నియంతను అధికారం నుంచి దించామనే సంతృప్తి ఉందన్నారు. 

కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డినే !

 ఫ్యామిలీ చీలికకు జగన్‌ మోహన్ రెడ్డికి ఎవరు హెల్ప్ అవసరం లేదు. ఆయనే చేసుకున్నాడు. జగన్ మూర్ఖంగా ఓ సైడ్ తీసుకున్నారు. వివేక హత్య విషయంలో అవినాష్ రెడ్డి చేయలేదని కన్విన్స్ అయ్యాని చెప్పారు. ఇదే మేజర్ ఇష్యూ. కొడుకు లాంటి వ్యక్తి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత అన్నగా కంటే సీఎంగా ఎక్కువ ఉంటుంది. అది జరగలేదు. అందుకే ఆయన చేతులారా కుటుంబాన్ని చీల్చేశారు.  నేనే సర్వస్వం అని రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడ కొట్లాడుతుంది న్యాయం కోసం. ఇక్కడ పోటీ న్యాయానికి నేరానికి. నేరం గెలవకూడదని మేం పోరాడుతున్నాం.  ఎవరు చంపారో అనేది హత్య చేసిన రోజున మాకు తెలియదు. అలా చేసింది సునీత భర్తై అయినా ఎవరైనా మాకు ఒకటే. తెలిస్తే అప్పుడే మాట్లాడేవాళ్లం. అప్పుడు సీబీఐ సీన్‌లోకి రాలేదు. ఇప్పుడు అన్ని ఆధారాలు బయటపెట్టిందికదా.  ఇంత మంది గుచ్చి గుచ్చి అడుగుతున్నా నేను పర్శనల్‌గా నమ్మాను అందుకే అవినాష్‌కు మద్దతు ఇస్తున్నట్టు జగన్ చెబుతున్నారు. జగన్‌ మోహన్ రెడ్డి ఏమైనా న్యాయవ్యవస్థ లేకా రాజ్యాంగమా? అదే అవినాష్ రెడ్డి సీబీఐకి కూడా చెప్పొచ్చుకదా. సిబీఐను కన్విన్స్ చేయొచ్చుగా. అదే జగన్‌ ఎలా నమ్ముతున్నారు. ఆయన లీడరా... లేకుంటే హిట్లరా ..? అని షర్మిల ఆశ్చర్యం  వ్యక్తం  చేశారు. 

వైసీపీలోనూ అభిమానులు - పెయిడ్ ఆర్టిస్టులతోనే దూషణలు

తనను   దూషించే వాళ్లు వైఎస్‌ అభిమానులో, వైసీపీ కార్యకర్తలో కాదని షర్మిల చెబుతున్నారు.  వీళ్లంతా రాక్ష సైన్యం. వైసీపీ సోషల్ మీడియా తరపున పని చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులు. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్‌ రెడ్డి ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులో, వైసీపీ అభిమానులో నన్ను దూషించడం లేదని చెబుతున్నారు. తనకు వైసీపీలో అభిమానులు ఉన్నారని  నేను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. చచ్చిపోయిన పార్టీని నిలబెట్టాన్నారు.   జగన్‌ను ఎలివేట్ చేస్తూ వచ్చిన మూవీల్లో షర్మిల ఎక్కడా కనిపించలేదు. అలా మిమ్మల్ని చూపించకుండా పట్టించుకోకుండా ఉండటం మానేస్తే ఆగిపోదన్నారు.  జగన్‌ను ప్రమోట్ చేయాలి. ఎక్కడైనా షర్మిలచూపిస్తే ఆమె చేసిన త్యాగాలు గుర్తుకు వస్తాయి. రాజశేఖర్‌ను పక్కన పెట్టైనా జగన్‌ను ప్రమోట్‌ చేయాలని వైసీపీలో చూస్తున్నారని చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ కూడా లేకుండా చేస్తున్నారని షర్మిల గుర్తు చేసుకున్నారు. 

నియోజకవర్గంలో తిరుగుతున్న మీకు ప్రజల్లో వస్తున్న స్పందన ఎలా ఉంది. వాళ్లు ఏం నమ్ముతున్నారు. 
కడప ప్రజలకు వివేకానందరెడ్డి కొత్తకాదు. 40 ఏళ్లుగా చాలా సేవలు చేశారు. బండి పట్టకపోయినా దగ్గరుండి ఆఫీస్‌కు తీసుకెళ్లి పని పూర్తి అయ్యేలా చూసేవాళ్లు. అంత చిత్తశుద్ధితో ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కాలంలో  దొరకనే దొరకడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇంత వరకు న్యాయం జరగలేదనే భావన వారిలో ఉంది. వాళ్లంతా తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 

వాళ్లంతా సింపతీ చూపిస్తారేమో కానీ... ఓట్లు వేస్తారా? జగన్‌కు కాదని మీకు ఓట్లు వేస్తారా
రాయలసీమ ప్రజలు కృతజ్ఞత కలిగినవాళ్లు. బతికి ఉన్న వ్యక్తుల కంటే చనిపోయిన వివేకానందెడ్డి ఎక్కువ ప్రయార్టీ ఇస్తారు. కరు మేలు చేస్తే మర్చిపోయే ప్రజలు కాదు. ఆడబిడ్డలు కోరిక కోరితే కాదు అనేవాళ్లు కూడా కాదు. 

జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గం కడప పరిధిలో ఉంది అక్కడే లక్షకు పైగా మెజార్టీ తెచ్చుకుంటాం అంటున్నారు. షర్మిల విజయం అంత ఈజీ కాదంటున్నారు. 
ఏం జరుగుతుందో చూద్దాం. మీరు అంత కాన్ఫిడెంట్‌గా ఉంటే భారతీ రెడ్డిని, వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వేలి విడిచిన కుటుంబాన్ని ప్రచారంలోకి ఎందుకు తీసుకొచ్చారు.  

షర్మిల వల్ల టీడీపీ లాంటి వాళ్లకు లాభం జరుగుతుందని చెప్పే వాళ్లకు మీరిచ్చి సమాధానం ఏంటీ?
అలా ఎందుకు అనుకోవాలి. నేను చంద్రబాబుకు ఎంత వ్యతిరేకమో వైసీపీకి అంతే వ్యతిరేకం. ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేకాబట్టి ఆ పార్టీ ఇక్కడ ఎదగాలని నేనుకోరుకుంటున్నాను. అలాంటప్పుడు నా ఇంట్రెస్ట్‌ ఏముండాలి. ఒకరికి అనుకూలంగా ఉండటానికి ఇదేమీ ఛారిటీ కాదు కదా. అందుకే కాంగ్రెస్ బలపేతానికి ఏం చేయడానికైనా సిద్ధమే. 

కాంగ్రెస్ బలపడిన చోటల్లా వైసీపీకే దెబ్బ పడుతుంది ఆ కోపంతోనేనా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్నీ రాజకీయాల్లోకి వద్దని చెప్పింది. 
అఫ్‌కోర్స్‌ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్లకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నా పార్టీ ఎదగాలని ఉంటుంది. ఆయనకి కూడా తన పార్టీ ఎదగాలని ఉంటుంది కదా. ఇప్పటి వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాకు అనేది గుర్తు పెట్టుకోవాలి. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చూశాం. ఇప్పుడు ఎంత స్కోర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు. 
డబుల్ డిజిట్ చేస్తామని నమ్ముతున్నాను. 

పలికేది షర్మిల అయినా పలికించేది మాత్రం చంద్రబాబు. రేవంత్ రెడ్డి ద్వారా నాపైకి ఉసిగొల్పారని జగన్ అంటున్నారు. 
జగన్ ఒక ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఒకరి చేతిలో కీలబొమ్మ అయితే జగన్ కూడా ఇంకొకరి చేతిలో కీలబొమ్మై ఉంటారు కదా. అసలు చంద్రబాబుకు ఏం పవర్ ఉందని... అదే ఉంటే జైలుకు పోకుండా కాపాడుకనే వాళ్లు కదా. జగన్ ఇమేజినేషన్స్‌లో బతుకుతున్నారేమో అన్న భయం కలుగుతోంది. ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకు చంద్రబాబు అనే ఇల్యూజన్‌లో ఉన్నారు. చంద్రబాబును పవర్‌ఫుల్‌ వ్యక్తిగా ఇమేజనేషన్ చేసుకుంటున్నారు. అందుకే అద్దం పంపించాను ఒక్కసారి చూసుకోమని. మీరు కనిపిస్తున్నారా చంద్రబాబు కనిపిస్తున్నారా అని అడిగాను.  

ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా వస్తే తట్టుకోలేరనిఅంటారు నిజమైనా 
ప్రతి మనిషికి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. అప్పుడెప్పుడో ఒకటి జరిగిందని ఈ మనిషి ఇంతేనని మాట్లాడటం కరెక్ట్ కాదు. 

మీ సిస్టర్‌ చంద్రబాబు కోసం ఎందుకు పనిచేస్తుందని అడిగితే... అందుకే నాకు తెలుసు అన్నారు. మీ గురించి అంత బాగా తెలుసా
తెలిస్తే నేను ఎంత మొండిదాన్నో తెలిసి ఉండాలి. ఇలాంటివి చేయను అని తెలిసి ఉండాలి.అదే బాధ. అందుకే ఆయన మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాను.  

మీ బ్రదర్‌ను మీరు మిస్ అవుతున్నారు. 
అవును. కానీ పరిస్థితులు వెనక్కి వెళ్లని విధంగా మారిపోయాయి.

మీరే మొండిగా ఉండటం వల్లే దూరం పెరిగిందా
అలా ఏం లేదు. ఒక స్థాయికి వెళ్లిపోయన తర్వాత మన చేతిల్లో ఏం ఉండదు. తెలంగాణలో పార్టీ పెట్టడం నా ఇష్టం. నేను రాజకీయాల్లోకి వెళ్లకూడదు అన్నది ఆయన ఇష్టం. ఆయన నిర్ణయానికి కట్టుబడాలని లేదు. నా లైప్ నా ఇష్టం. రాజకీయాల్లో ఉండాలని నా నిర్ణయం. ఇలా ఒక్కొక్క డెసిషన్ యాడ్‌ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది. 

ఒకసారి వచ్చి మిమ్మలి కలిశారు కదా
కలిస్తే ఏమవుతుంది. సీఎం అయిన తర్వాత ఆయన వేరే వ్యక్తి. నేను గుర్తు పట్టలేనంతా ఆ స్థాయికి వెళ్లిపోయారు. అన్నేనా అన్నట్టు అనిపించింది. 

వైఎస్ షర్మిలతో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్యూ ఈ లింక్‌లో చూడవచ్చు   

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget