అన్వేషించండి

Sajjala Comments : నలుగురు వ్యక్తులు చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదు - రూమర్స్‌కు చెక్ పెట్టిన సజ్జల

Andhra Politics : వైసీపీ పలువురు అభ్యర్థుల్ని మార్చ బోతోందని జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు చెక్ పెట్టారు. అభ్యర్థుల్ని మార్చే ప్రశ్నే లేదన్నారు.

No Change of Candidates in YCP :  వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది అభ్యర్థులను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని   వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తోసిపుచ్చారు. నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన.. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. నలుగురు వ్యక్తులు వచ్చి చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు . సజ్జల క్లారిటీతో వైసీపీలో అభ్యర్థుల మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.                         

కొన్ని సీట్ల విషయంలో మార్ప చేర్పుల విషయంలో  వైసీపీ  హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోందని ఇటీవల ప్రచారం ఊపందుకుంది.  ముఖ్యంగా మైల‌వరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు.  తో వైసీపీ కుల స‌మీక‌ర‌ణాల లెక్క‌లు వేసుకొని చివ‌ర‌కు మైల‌వ‌రం ఎంపీపీగా ఉన్న స‌ర్నాల తిరుప‌తిరావును అభ్యర్థిగా   ప్ర‌క‌టించారు. కానీ  మంత్రి జోగి ర‌మేష్ విజ్ఞప్తితో ఆయనను అక్కడకు మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.  పెడ‌న నుండి గెలిచిన మంత్రి జోగి ర‌మేష్ కు ఈసారి పెన‌మ‌లూరు టికెట్ ఇచ్చారు. మైలవరం జోగి రమేష్ సొంత నియోజకవర్గం.        

  మరో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ సీటు కూడా మ‌రోసారి మార‌బోతున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.   చిల‌క‌లూరిపేట నుండి గెలిచిన ఆమెను   రి గుంటూరు వెస్ట్ కు పంపారు. ఇప్పుడు త‌న‌ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్న‌ారని చెప్పుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య.. తన సీటు మార్చాలని పొన్నూరు ఎమ్మెల్యే లేటు సీటు లేదా గుంటూరు పశ్చిమ సీటు ివ్వాలని కోరుతున్నట్లుగా చెపుతున్నారు.   ఇక జ‌న‌సేన నుండి వైసీపీలో చేరిన పోతిన మ‌హేష్ కు విజ‌య‌వాడ వెస్ట్ సీటు కేటాయిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ వార్తలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.                 

ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం లేదని సజ్జల అంటున్నారు.    కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  చంద్రబాబు   అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి.. జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు.                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Viral Video: చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ముప్పు, ల్యాండింగ్ సమయంలో భయానక పరిస్థితులు
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Embed widget