అన్వేషించండి

Telangana Election Results : టెస్ట్ పాసైన రేవంత్ రెడ్డి - ఇక ఐదేళ్లూ ప్రభుత్వానికి ఢోకా లేనట్లే !

Telangana Politics : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు తప్పినట్లయింది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, ఎనిమిది సీట్లను కాంగ్రెస్ గెల్చుకోవడంతో ప్రభుత్వం జోలికి రారని భావిస్తున్నారు.

Revanth Reddy government stable For Five Years :  తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టే... రేవంత్ రెడ్డి ప్రభుత్వ మనుగడ ఉంటుందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.  ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.  కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించకపోయినా సరే.. ఆ పార్టీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం   బీజేపీతో సమానంగా సీట్లు తెచ్చుకోవడమే కాదు కేంద్రంలో  బీజేపీ కి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కూడా ఓ కారణమని అంచనా వేస్తున్నారు. 

చెరో ఎనిమిది సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్, బీజేపీ 
 
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటాగా సాగాయి. చివరికి రెండు పార్టీలు చెరో ఎనిమిది సీట్లను గెల్చుకున్నాయి. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల మూడో స్థానంలో ఉంది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అంటే.. కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే యాడ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారికంగా అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారు అదనం. బీజేపీ కాంగ్రెస్ కన్నా ఒకటి , రెండు సీట్లలో ఎక్కువ సాధించి ఉన్నట్లయితే..ఆ పార్టీ నుంచి కాపాడుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు కేంద్రంలోనూ బీజేపీ బలహీన ప్రభుత్వమే ఏర్పడుతోంది. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం జోలికి వచ్చే అవకాశం లేదు. 

సికింద్రాబాద్‌లో జి.కిషన్ రెడ్డి విజయం - స్వల్ప తేడాతోనే గెలుపు

బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా సహకరించిన బీఆర్ఎస్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి  ఆ ప్రభుత్వం ఉండదని పదే పదే అభిప్రాయం చెప్పేవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. ఎలా జరుగుతుందో కూడా విశ్లేషించేవారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు  పరిమితంగా సీట్లు వస్తాయని.. బీజేపీకి ఎక్కువ వస్తాయని ఆ తర్వాత బీజేపీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుందని అంచనాలు వేస్తూ వచ్చారు.  కేసీఆర్ కూడా తమ పార్టీ సమావేశాల్లో ఇవే చెబుతూ వచ్చారు. వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని కాంగ్రెస్ కు సహించే ప్రశ్నే ఉండదని ఆయన అభిప్రాయం.  ఈ పరిస్థితి తీసుకు రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కేసీఆర్ బీజేపీకి సహకరించారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తేల్చేందుకు బీజేపీకి సైలెంట్ గా సపోర్టు చేశారు. అది లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమయింది.  

ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కే ముప్పు 

అయితే తెలంగాణలో బీజేపీ .. ఎనిమిది సీట్లు సాధించింది కానీ... దేశంలో అంత ప్రోత్సాహకర ఫలితాలు లేవు. అందుకే  బీజేపీ సంయమనం పాటించే అవకాశం ఉంది.  అయితే ఇప్పుడు బీజేపీ బలపడే ప్రయత్నాలు మాత్రం ఆపదు.   బీఆర్ఎస్  ఉనికిని వీలైనంతంగా పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంది.  బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను కాపాడుకోలేకపోయింది.  ఇప్పుడు ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకుంటాయి. ఎక్కువగా బీజేపీ పంచన చేరిపోతారు. ఎందుకంటే.. మరో రెండు, మూడేళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీగా బీజేపీనే  చూస్తారు. అందుకే ఆ పార్టీలో చేరిపోతారు. బీఆర్ఎస్ బలహీనపడుతుంది. క్రమంగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలోనూ  ప్రతిపక్ష స్థానానికి బీజేపీ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్- ఓటు బ్యాంకు కొట్టేసిన కమలం!  

రేవంత్‌కు ఇబ్బందికరమే కానీ పదవి పోయేంత సమస్య కాదు ! 

మరో వైపు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఫలితాలు ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్ కు పార్టీ నేతలు లేనిపోనివి చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్లవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో  గట్టిగా పోరాడినా ఓడిపోవాల్సి వచ్చింది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినా పార్టీ ఓడిపోయింది. డీకే అరుణకు.. బీఆర్ఎస్ పార్టీ సహకరించడమే కారణం. అలాగే తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు రేవంత్ ను గట్టెక్కించాయని అనుకోవచ్చు.  బీజేపీ అగ్రనేతలు కోరుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు కేంద్రంలో వచ్చినట్లయితే రేవంత సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేవంత్ సేఫ్ జోన్ లోకి వెళ్లారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget