News
News
X

Punjab Election 2022: పంజాబ్ ఎన్నికలకు కెప్టెన్ రెడీ.. భాజపాకు 65, అమరీందర్‌కు ఎంతంటే?

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కూటమిలో సీట్ల పంపకాన్ని పూర్తి చేసింది భాజపా. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటించారు.

FOLLOW US: 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న భాజపా, కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ సీట్ల పంపంకం కొలిక్కి వచ్చింది. మొత్తం 117 స్థానాలకు గాను భాజపా 65 చోట్ల పోటీ చేయనుండగా, అమరీందర్ సింగ్ పార్టీ 37 స్థానాల్లో బరిలోకి దిగనుంది. శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్‌)కు 15 సీట్లు కేటాయించారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

పంజాబ్​లోని ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాల నేతలతో దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు నడ్డా. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, సర్దార్​ సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సా హాజరయ్యారు.

" పంజాబ్‌లో భాజపా కూటమి సర్కార్ అధికారంలోకి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంత అభివృద్ధి కుంటు పడింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే తిరిగి దూసుకెళ్తుంది. 1984 అల్లర్లపై ప్రధాని మోదీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం వల్లే ఇప్పుడు దోషులు జైల్లో ఉన్నారు. భాజపాకు అధికారం ఇవ్వండి మాఫియా రాజాలను మాయం చేస్తాం.                                                         "
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

సిద్ధూ కోసం సందేశం..

సీట్ల పంపంకంపై మాట్లాడిన తర్వాత పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

" నా కేబినెట్ నుంచి సిద్ధూను తొలగించిన తర్వాత పాకిస్థాన్​ ప్రధానికి ఆయన పాత స్నేహితుడని ఆ దేశం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. తన ప్రభుత్వంలోకి తిరిగి తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని అందులో ఉంది. ఒకవేళ సరైన పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించాలని అందులో ఉంది. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. సిద్ధూ లాంటి వ్యక్తి పంజాబ్‌ను పరిపాలించకూడదు. కనుక భాజపా కూటమికే ఓటు వేయండి. మా కూటమిని గెలిపించండి.                                                 "
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం

Also Read: Rashtriya Bal Puraskar 2022: 'దేశమే మీ తొలి ప్రాధాన్యం కావాలి..' జాతీయ బాల పురస్కారాలు ప్రదానం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Jan 2022 06:57 PM (IST) Tags: amarinder singh Punjab Election 2022 Punjab Assembly Elections 2022 Punjab Election 2022 Result Date Punjab Election 2022 Schedule Punjab Election 2022 News Punjab Election 2022 Voting Punjab Election 2022 Dates BJP Seat Sharing Formula SAD-Sanyukt

సంబంధిత కథనాలు

Munugodu TRS : ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం - టీఆర్ఎస్‌లో మునుగోడు రచ్చ !

Munugodu TRS : ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం - టీఆర్ఎస్‌లో మునుగోడు రచ్చ !

Munugodu By Elections: మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!

Munugodu By Elections: మునుగోడులో టీఆర్‌ఎస్‌ సమరశంఖం- పోటీ చేసేదెవరో తేల్చేసిన కేసీఆర్!

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Bandi Sanjay Interview: 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు- ఏబీపీ దేశంతో బండి సంజయ్ .

Bandi Sanjay Interview: 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు- ఏబీపీ దేశంతో బండి సంజయ్ .

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!