Prime Minister Modi Interview : అవినీతి పరులపై చర్యలు ఆగవు - వాళ్లకు పాకిస్తాన్ మద్దతుపై విచారణ - మోదీ కీలక వ్యాఖ్యలు
National Politics :పాకిస్తాన్ నుంచి రాహుల్ గాందీ, కేజ్రీవాల్‌కు వస్తున్న మద్దతుపై విచారణ చేయాల్సి ఉందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిని సహించేది లేదని పెద్ద చేపల్ని ఇప్పుడే పట్టుకుంటున్నామని తెలిపారు
Modi Interview : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్‌లకు పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందని ప్రధాని మోదీ కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారసభల్లోచెబుతున్నారు. వారు గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందన్నారు. ఇదే విషయాన్ని ఇయాన్స్ కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూలో ప్రధాని మోదీ కూడా ధృవీకరించారు. భారత్ లోని వ్యక్తులకు పాకిస్థాన్ నుంచి మద్దతు ఎందుకు వస్తుందో తెలియాల్సి ఉందన్నారు. ఇది విచారణ ద్వారా తేలుతుందని వ్యాఖ్యానించారు.
అవినీనిని అంతం చేశాం !
బీజేపీ పాలనలో అవినీతి అనేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దానికి గతంలో రాజీవ్ గాందీ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రభుత్వం పేదల కోసం రూపాయి ఖర్చు పెడితే పేదలకు పది పైసలు మాత్రమే చేరుతుందని ..అవినీతి ఆ స్థాయిలో ఉందని చెప్పారు. అదే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసిన ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం పేదలకు నేరుగా డీబీటీ ద్వారా రూ. 38 లక్షల కోట్లను పంపిణీ చేసిందని .. అదే కాంగ్రెస్ విధానం ఉండి ఉంటే అందులో రూ. 25 నుంచి 30 లక్షల కోట్లు అవినీతి రూపంలో మళ్లిపోయేవన్నారు.
IANS Exclusive
— IANS (@ians_india) May 27, 2024
''Much like termites, corruption is making the system hollow from the inside... It's difficult to understand the motive of the Khan Market Gang and why it is framing such a narrative to save the criminals from facing the law... Independent agency apprehends the… pic.twitter.com/tdCmBPgX0u
పెద్ద పెద్ద అవినీచి చేపల్ని పట్టుకుంటూంటే గగ్గోలు పెడుతున్నారు !
రాజకీయ అవినీతి విషయంలో తాము ఉక్కుపాదం మోపుతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పెద్ద పెద్ద చేపల్ని ఇప్పుడే పట్టుకుంటున్నామని తెలిపారు. అయితే వాళ్లను ఎందుకు పట్టుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఇలానే వ్యవహరిస్తోందని.. ఇందులో రాజకీయ కుట్ర ఉందన్న ఓ నేరేటివ్ ను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో సోనియాగాంధీని జైలుకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే అరెస్ట్ అక్రమం అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి వ్యవస్థల్ని నాశనం చేస్తుందని స్వతంత్ర దర్యాప్తు సంస్థల మీద కూడా ఖాన్ మార్కెట్ గ్యాంగ్ నిందలు వేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.. న్యాయవ్యవస్థ శిక్షలు విధిస్తుందని అందులో రాజకీయ ప్రమేయమే ఉండని స్పష్టం చేశారు.
బీజేపీ సిద్ధాంతాలు నచ్చని సినిమా వాళ్లనూ కలిశా !
బీజేపీకి నచ్చితేనే కలుస్తారన్న అభిప్రాయాలను తాము ఎప్పుడో పటాపంచలు చేశామని మోదీ తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మందిని కలిశనని.. అందులో బీజేపీ విధానాలు.. ప్రభుత్వ విధానాలు నచ్చని వారు కూడా ఉన్నారన్నారు. తమను వ్యతిరేకిస్తున్నారని వారిని వ్యతిరేకించడం దూరం పెట్టడం కాదని.. వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించడమే తన విధి అని ప్రధాని మోదీ తెలిపారు.
IANS Exclusive
— IANS (@ians_india) May 27, 2024
"I also had a meeting with people from the film industry. I knew that this fraternity was quite distant from our ideologies, and also from my government. But my job was to understand their issues," said PM Modi pic.twitter.com/r0g6LVYhZj
ఇండియా ఫస్ట్ అనేదే మా విదేశాంగ విధానం
భారత విదేశాంగ విధానానికి ఒకటే ప్రాతిపదిక అని మోదీ స్పష్టం చేశారు. ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని విదేశీ మంత్రిత్వ శాఖకు తాను చెప్పానన్నారు. మొత్తంగా మూడు విషయాలపై వారికి దిశానిర్దేశం చేశానన్నారు. మన వేరే దేశాలకు ఎగుమతి చేయడం.. అవసరమైన టెక్నాలజీని ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడం.. భారత్ కు పర్యాటకుల సంఖ్యను పెంచడం వంటి మూడు విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని విదేశాంగశాఖకు సూచించామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాల్లో ఇండియా ఫస్ట్ అనే మూల సూత్రాన్ని పాటిస్తామన్నారు.