అన్వేషించండి

పీసీసీ చీఫ్‌ను తిడితే అధిష్ఠానాన్ని తిట్టినట్టే- కారు మూడు ముక్కలు - కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పొన్నాల లక్ష్మయ్యను డాలర్ లక్ష్మయ్య అని పిలిచే వారని కాంగ్రెస్‌ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని గుర్తు చేసారు కోమటిరెడ్డి. అలాంటి వ్యక్తి పార్టీ మారడం బాధకలిగించిందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్‌ రెడ్డి. టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు  ఉంటాయని వాటిలో టికెట్ రానివారిని సర్దుబాటు చేస్తామన్నారు. 

పొన్నాల లక్ష్మయ్యను డాలర్ లక్ష్మయ్య అని పిలిచే వారని కాంగ్రెస్‌ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని గుర్తు చేసారు కోమటిరెడ్డి. అలాంటి వ్యక్తి పార్టీ మారడం బాధకలిగించిందని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ మారడం తప్పుకాదు కానీ... వెళ్లిపోయేటప్పుడు పార్టీపై పార్టీ నాయకత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. టికెట్లు ఇచ్చేది పీసీసీ చీఫ్ కాదని ఆయన్ని తిడితే అధిష్ఠానాన్ని తిట్టినట్టేనన్నారు. ఆయన కేవలం కోఆర్డినేటర్ మాత్రమేనని.. టికెట్ల వ్యవహారమంతా అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. పొన్నాల పార్టీలో ఉండి ఉంటే విజయం సాధించిన తర్వాత రాజ్యసభ సీటు వచ్చేదేమో అన్నారు. 

ఇప్పటికి ప్రకటించిన మొదటి జాబితాలో బీసీలకు 12, జనరల్ 26 సీట్లు, మైనారిటీలకు 3 సీట్లు ఇచ్చామని తెలిపారు కోమటి రెడ్డి. బీసీలకు 12 వచ్చాయి. తర్వాత జాబితాలో కూడా వస్తాయి బీసీలకు తగిన గుర్తింపు ఉంటుందని కచ్చితంగా కేసీఆర్ కంటే నాలుగు సీట్లు అధికంగానే ఇస్తామన్నారు.

టికెట్స్ రానివారు ఎలాంటి నిరాస లేకుండా ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు కోమటి రెడ్డి. కాంగ్రెస్ పార్టీ విజయం కోసమే అందరూ కలిసి పని చేయాలని సూచించారు. ఎన్ని కేసులు పెట్టినా సరే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అలాంటి వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. 

టికెట్ రానివాళ్లూ వచ్చినవారితోపాటు కలిసి పనిచేయాలని హితవుపలికారు కోమటిరెడ్డి. సామాజిక సమీకరణాలు చూసి టిక్కెట్లు ఇస్తారని... కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా తమకూ నష్టమేనన్నారు కోమటిరెడ్డి. మిర్యాలగూడ వామపక్షాలు అడుగుతున్నాయని.. అది కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటని తెలిపారు. మునుగోడు ఇస్తామంటే వాళ్లు మాత్రం కొత్తగూడెం కోసం పట్టుబడుతున్నారని వివరించారు. జాతీయస్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుందని దాన్ని అంతా గౌరవించాలన్నారు. 

బీఆర్‌ఎస్ పాలనలో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని విమర్శించారు కోమటిరెడ్డి. డీఎస్సీ నియామకాలు లేవన్నారు. అందుకే స్కూళ్లకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రవళిక అనే అమ్మాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అయి, పరీక్షలు రద్దు కావడం వల్ల ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కోడ్ వచ్చే ముందు నోటిఫికేన్లు ఇస్తారని... కోడ్ కారణంగా అవి వాయిదా పడతాయని ఎప్పుడూ ఇది జరిగేదని ఎద్దేవా చేశారు. 

కార్ కావాలా బేకార్ గాండ్లు కావాలా అన్న మాటలను తీవ్రంగా కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. గ్యారంటీ, వారంటీ తీరిపోయింది అంటున్న వాళ్లు... పదేళ్లలో అందరికీ పదవులు ఇస్తా డొక్కు కార్ ఎక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. అది ముక్కలు అవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ ముక్కలు అవుతుందని విమర్శించారు. కవితకు ఒకటి, కేటీఆర్‌కి ఒకటి, హరీశ్‌కి ఒకటి చీలికలు ఏర్పడతాయన్నారు. 

దేశపతి శ్రీనివాస్ కొటేషన్లు రాసిస్తే కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని...రామలింగ రాజు, ఆయన కొడుకు తేజ రాజు చెప్పినట్టు కేటీఆర్ నడుచుకుంటారని ఆరోపించారు. తెలంగాణలో ధర్నాలు చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారెందుకని నిలదీశారు. ధర్నా చేసేవారిలో కమ్మ వారు మాత్రమే కాదు, అందరూ ఉన్నారని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget