అన్వేషించండి

Gangula Kamalakar: కరీంనగర్‌లో మంత్రి గంగుల గట్టెక్కుతారా? ఈసారి పరిస్థితి అంత ఈజీ కాదు!

Karimnagar: వరుసగా మూడుసార్లు గెలిచిన గంగుల కరీంనగర్‌లో తిరుగులేని నేతగా ఉన్నారు. టీడీపీ తరుపున కార్పోరేటర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చిన గంగుల 2009లో ఆ పార్టీ తరపునే గెలిచారు.

Gangula Kamalakar in Karimnagar: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలా నిలిచిన ప్రాంతం కరీంనగర్ (Karimnagar Politics). మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కరీంనగర్‌లో ఎప్పుడూ కారు పార్టీదే హవా.  కానీ ఈ సారి పరిస్థితి అంత ఈజీగా లేదు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో పట్టు సడలుతోంది. మంత్రి గంగుల గట్టెక్కుతారా లేదా అన్న సందేహం ఆ పార్టీలోనే మొదలైంది. మూడు దఫాలుగా కరీంనగర్ నుంచి ఎన్నికవుతున్న గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కు ఈ సారి గట్టి పోటీనే ఎదురవుతోంది. 

మంత్రి గంగుల మరోసారి కష్టమా
వరుసగా మూడుసార్లు గెలిచిన గంగుల కరీంనగర్‌లో తిరుగులేని నేతగా ఉన్నారు. టీడీపీ తరుపున కార్పోరేటర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చిన గంగుల 2009లో ఆ పార్టీ తరపునే  గెలిచారు. 2014 లో తెలంగాణ ఏర్పాటు కంటే ముందే బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014లో  అప్పట్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 25వేల మెజార్టీతో బండి సంజయ్‌పై గెలుపొందారు. 2018లో కూడా బండి సంజయ్ (Bandi Sanjay) పైనే రెండోసారి 14వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు  మూడోసారి గంగుల బండి సంజయ్ తలపడుతున్నారు. పోటీ వీళ్లద్దరి మధ్యే ఉండగా.. కాంగ్రెస్ పార్టీ పురుమళ్ల శ్రీనివాస్ రంగంలోకి వచ్చారు. 

ముక్కోణపు పోటీ ఖాయమా
మూడు సార్లు గెలిచాక సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతతో పాటు.. ఈ మధ్య కాలంలో అందరినీ కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి గంగులపై ఉంది. ప్రతీసారి మైనార్టీ ఓట్లతో నెగ్గుతున్న గంగులకు ఇప్పుడు వాళ్లే వ్యతిరేకమయ్యారు. సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా.. పార్టీలో ఉండీ.. కొంతమంది గంగులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో వారి స్థలాలను గంగుల అనుచరులు కబ్జా చేశారని.. దీనిపై ఆయన స్పందించకపోవడంతో ఆ వర్గాలు బాగా అసంతృప్తిగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ పై ఉన్న వ్యతిరేకతకు తోడు గంగుల స్వయంగా కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కరీంనగర్‌ స్మార్ట్ సిటీ అభివృద్ది పనులు, రివర్ ఫ్రంట్ డవెలప్‌మెంట్, తీగల వంతెన వంటి భారీ పనులు చేపట్టినప్పటికీ.. అభివృద్ధి ని అవినీతి డామినేట్ చేసిందంటున్నారు.

ఇక వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా దూరం కావడంతో బండి సంజయ్‌ పై బాగా సంపతీ ఉంది. ఎప్పటి నుంచో అక్కడే రాజకీయాలు చేస్తున్న స్థానికుడు కావడంతో సింపతీ వర్కవుట్ అయితే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ కూడా ఈ దఫా గట్టిపోటీ ఇస్తుంది. కరీంనగర్‌ పట్టణ పరిధిలోని  కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థికి గట్టి పట్టు ఉంది. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉండటంతో లోకల్‌గా సంబంధాలు ఎక్కువుగా ఉన్నాయి. కొన్ని వార్డుల పరిధిలో ఏకమొత్తంగా కాంగ్రెస్‌ను బలపరిచే పరిస్థితి ఉంది. గంగులకు దూరం అయిన ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నాయి. సొంత ఇమేజ్, ముస్లిం ఓట్లు, కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన బలం వంటి కారణాలు కలిసొస్తే.. పురుముళ్ల కూడా జెండా ఎగరేయొచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Digital Card: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వేలో ఏం అడుగుతున్నారు? మనం ఏం ఇవ్వాలి?
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Bihar Nitish Kumar : బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
Embed widget