Kottu Satyanarayana: మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం - కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలన్న ఉద్యోగులు, తాడేపల్లిగూడెంలో ఘటన
Andhra News: మంత్రి కొట్టు సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా ఉద్యోగులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ ఓ వీడియో షేర్ చేసింది.
Government Employees Protest Against Minister Kottu Satyanarayana In Tadepalligudem: మంత్రి కొట్టు సత్యనారాయణకు (Kottu Satyanarayana) గురువారం చేదు అనుభవం ఎదురైంది. తాడేపల్లిగూడెంలో (Tadepalligudem) పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న సమయంలో ఉద్యోగులు ఆయనపై నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన టీడీపీ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తోన్న ఉద్యోగులను మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించింది. 'మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డారు. పోలీసుల సాయంతో మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు. జగన్ రెడ్డి బయటకు రాకుండా, ఇంట్లో దాక్కుంటుంది ఇందుకే' అంటూ ట్వీట్ లో పేర్కొంది.
తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ పై తిరగబడ్డ ఉద్యోగులు.. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి అంటూ మంత్రి పై ఉద్యోగులు తిరగబడటంతో, పోలీసుల సాయంతో జారుకున్నాడు.
— Telugu Desam Party (@JaiTDP) May 9, 2024
జగన్ రెడ్డి బయటకు రాకుండా, ఇంట్లో దాక్కుంటుంది… pic.twitter.com/3o6LzgkQ2A