అన్వేషించండి
Advertisement
AP Election Results: ఏపీ ఫలితాల ఎఫెక్ట్ - తెలుగుదేశం కుటుంబంలో ఆనందం, వైసీపీ ఫ్యామిలీలలో నైరాశ్యం!
AP Election Results 2024: టీడీపీ కూటమి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రబంజనం సృష్టించింది. ఒకే కుటుంబం నుంచి పోటీ చేస్తే వైసీపీ నుంచి ఓటమి చెందగా, టీడీపీ నుంచి పోటీ చేసిన ఫ్యామిలీలు గెలిచాయి.
AP Assembly Election 2024 Results: ఒక ఇంటి నుంచి రాజకీయాలకు ఒకరు రావడమే గొప్ప అని భావిస్తాం. కానీ కొన్ని కుటుంబాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది రాజకీయాల్లో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో కొన్ని కుటుంబాల నుంచి ఒకరికి మించి ఎక్కువ మంది ఈసారి పోటీ చేశారు. కొందరు విజయఢంకా మోగించగా.... మరికొందరు బొక్కబోర్లాపడ్డారు. తండ్రీ కుమారులు, అన్నదమ్ములు కలిసి ఈసారి ఎన్నికల బరిలో దిగారు. ఎవరెవరు లాభపడ్డారో.. ఎవరెవరు నష్టపోయారో ఒకసారి చూద్దాం.
తెలుగుదేశం హవా
తెలుగుదేశం చరిత్రలోనే కాదు.... రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ కనీవిని ఎరగని ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఓట్ల సునామీలో తెలుగుదేశం కూటమి నుంచి సీట్లు తెచ్చుకుంటే చాలు సునాయసంగా విజయం సాధించవచ్చని ముందునుంచీ అనుకున్న విధంగానే ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి పోటీపడి చాలామంది విజయం సాధించారు. అలాంటి వారిలో తొలివరుసలో ఉన్నారు శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నుంచి బాబాయి-అబ్బాయి. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ ఓడిపోలేదు. శ్రీకాకుళం ఎంపీగా మరోసారి కింజరపు రామ్మోహన్‌నాయుడు(Rammohan Naidu) విజయదుందిబి మోగించగా....టెక్కలి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) హవా కొనసాగించారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అలాగే రామ్మోహన్‌నాయుడికి స్వయంగా మామ అయిన మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru satyanarayana Murthy) తెలుగుదేశం పార్టీ నుంచే మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే రామ్మోహన్‌నాయుడి సొంత బావ ఆదిరెడ్డి వాసు(Adireedy Vasu) రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఏకంగా 70వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు.
చంద్రబాబు, బాలయ్య ఫ్యామిలీలు సూపర్ హిట్
అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన పుట్టా మహేశ్( Putta Mahesh Yadav), కడప జిల్లా మైదుకూరు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన పుట్టా సుధాకర్ యాదవ్(Putta sudhakar Yadav) స్వయానా తండ్రీకొడుకులు. అలాగే కుప్పం నుంచి చంద్రబాబు( Chandra Babu) విజయం సాధించగా... ఆయన కుమారుడు నారా లోకేశ్(Lokesh) మంగళగిరి నుంచి మోత మోగించారు. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ(Balakrishna) హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అలాగే బాలకృష్ణ రెండో అల్లుడు, లోకేశ్‌కు తోడల్లుడైన శ్రీభరత్(Sri Bharath) విశాఖ ఎంపీగా ఏకంగా ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఇక విజయవాడ ఎంపీ స్థానానికి ప్రత్యర్థులుగా సొంత అన్నదమ్ములు కేశినేనినాని(Kesineni Nani), కేశినేని చిన్ని (Kesineni Chinni)పోటీపడగా...చిన్నిని విజయం వరించింది.
వైసీపీలో నేతల అడ్రస్ గల్లంతు
వైసీపీ నుంచి పోటీచేసిన పలువురి నేతలు ఘెరంగా ఓటమిచెందారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడి(Muthyala Naidu)తోపాటు, మాడుగుల ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన కుమార్తె అనురాధ సైతం ఓటమి పాలయ్యారు. తణుకు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswararao)పై తెలుగుదేశం అభ్యర్థి దాదాపు 70వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందగా... ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్ దాదాపు లక్షా 81 వేల ఓట్ల తేడాతో ఏలూరు ఎంపీగా ఓటమి పాలయ్యారు. అవనిగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సింహాద్రి రమేశ్(Simhadri Ramesh) జనసేన అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ చేతిలో 46వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోగా.. ఆయన సోదరుడు సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి...జనసేన అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓటమి పాలయ్యారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోగా.... ఆయన సోదరుడు అంబటి మురళి పొన్నూరు నుంచి పోటీ చేసి ధూళిపాళ్ల నరేంద్ర చేతిలో ఓటమి చవిచూశారు. అలాగే ప్రకాశం జిల్లా కొండపి నుంచి పోటీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్(Adimulam Suresh)తోపాటు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సతీశ్ సైతం ఓటమి పాలయ్యారు. అలాగే సంతనూతలపాడు నుంచి పోటీ చేసిన మేరుగ నాగార్జునతోపాటు నెల్లూరు జిల్లా గూడురు నుంచి పోటీ చేసిన మేరుగ మురళీ సైతం ఓటమి చవిచూశారు.
పులివెందుల నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్(Jagan)తోపాటు ఆయనకు వరుసకు సోదరుడైన అవినాష్ రెడ్డి(Avinash Reddy) కడప ఎంపీగా గెలుపొందారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Pedhireddy Ramchandra Reddy)తోపాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నుంచి మాత్రమే గెలుపొందారు. మిగిలిన అన్నిచోట్ల పోటీ చేసిన కుటుంబ సభ్యులు ఓటమి చవిచూశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion