అన్వేషించండి

Fact Check: జనాలని మోసం చేశానన్న ఏపీ సీఎం జగన్ వీడియోలో వాస్తవం ఇదీ

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ప్రజల్ని మోసం చేశానని చెప్పారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సీఎం జగన్ ప్రతిపక్ష కూటమి గురించి వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాక్ట్ చెక్
ఒరిజినల్ వీడియోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు.

క్లెయిమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశాను అని ఒప్పుకుంటున్న వీడియో అని క్లైమ్ చేస్తూ ఒక 16 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయని తెలిసిందే.

“ఈ ఎన్నికలలో మీ బిడ్డ, మీ బిడ్డ ఒక్కడు, అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి,” అని జగన్ అనటం మనం వినవచ్చు. ఈ క్లిప్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ ఇక్కడ  చూడవచ్చు.  

Fact Check: జనాలని మోసం చేశానన్న ఏపీ సీఎం జగన్ వీడియోలో వాస్తవం ఇదీ

సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్ షాట్ (Source: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో జగన్ ప్రతిపక్ష కూటమిని విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలో తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి.

ఆ వీడియోపై ఏం తెలిసింది.. 

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకుగా ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఏప్రిల్ 19, 2024 నాడు కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వీడియో ఇది. ఈ సభని సాక్షి చానల్ లైవ్ స్ట్రీమ్ చేసింది. వైరల్ వీడియోలో కూడా సాక్షి లోగో చూడవచ్చు.

ఈ ఒరిజినల్ వీడియోలో జగన్ 22:55 నుండి 23:21 మధ్య చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి, వేరే చోట్ల యాడ్ చేసి వీడియోని వైరల్ చేశారు.

ఈ భాగంలో సీఎం జగన్, “ఈ ఎన్నికలలో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకం అయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు, తోడేళ్ళు అనేక మంది,” అని చెప్పటం మనం వినవచ్చు.

ఈ భాగంలో నుండి “మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి” అనే భాగాన్ని క్రాప్ చేసి, తన గురించి తాను మాట్లాడుతున్న భాగంలోకి జొప్పించి, తాను ప్రజలని మోసం చేశానని ఒప్పుకుంటున్నట్టుగా వైరల్ వీడియోని చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో, తాను ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఇటువంటి అనేక ఎడిటెడ్ వీడియోలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది. వాటిల్లో కొన్నింటిని ఇక్కడ ఇక్కడ  చదవొచ్చు. 

 వాస్తవం (Fact) 
ఎడిటెడ్ వీడియో క్లిప్ షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశానని ఒప్పుకున్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో తను ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని నిర్ధారణ అయింది. 

This story was originally published by Logicallyfacts, as part of the Shakti Collective. Except for the headline, excerpt and opening introduction para, this story has not been edited by ABP Desam staff. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Asad Vs BJP: టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
Embed widget