Elections Updates: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
Loksabha Elections 2024: తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో మూడు నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిపోయింది.
![Elections Updates: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్ Election voting ends at 4pm in maoist effected areas in telugu states Elections Updates: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/250aae53cc4ab9e4ba957a1b233053d61715597913887234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maoist Effected Areas in Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తి కాగా.. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఏపీలో మూడు నియోజకవర్గాల్లోనూ 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.
ఏపీలో మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిపోయింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియగా.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)