![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Election Results 2023: వచ్చేది ఒకటి, పోయేది మూడు - నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదేనా?
Election Results: మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ వెనకంజ వేస్తుండడం ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది.
![Election Results 2023: వచ్చేది ఒకటి, పోయేది మూడు - నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదేనా? Election Results 2023 BJP Leads In 3 States, Congress Trails In Hindi Heartland Election Results 2023: వచ్చేది ఒకటి, పోయేది మూడు - నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/03/4270b40c9b54e9e5d7f28fb8b8869eb91701588999401517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election Results 2023 Updates:
3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని (Five States Election Results 2023) సెమీఫైనల్‌గా భావించాయి అన్ని పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ భవిష్యత్‌ని డిసైడ్ చేసే ఫలితాలివి. ఈ 5 రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా ఇంపాక్ట్ చూపించాల్సిన సమయమిది. ఇప్పుడు ఫలితాల ట్రెండ్‌ని పరిశీలిస్తుంటే...ఒక్క తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ వెనకంజలో ఉంది. చాలా ఆశలు పెట్టుకున్న ఛత్తీస్‌గఢ్ కూడా చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోనూ (Rajasthan Congress) కచ్చితంగా మళ్లీ గెలుస్తాం అని ధీమాగా ఉన్నప్పటికీ...ఫలితాల సరళి తరవాత ఆ విశ్వాసం తగ్గిపోయింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ విజయం దిశగా దూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. కాస్తో కూస్తో కాంగ్రెస్‌కి జోష్ ఇస్తున్న ఫలితాలు తెలంగాణవి మాత్రమే. అధికార BRSని వెనక్కి నెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయి. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి.
అక్కడ పట్టు కోల్పోయినట్టేనా..?
ఒక్క తెలంగాణలో తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వీటిపై చాలానే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ చతికిలబడిపోయింది. ఇప్పటికిప్పుడు ఫలితాల సరళిని చూస్తుంటే...ఈ నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ చేజారిపోతాయేమో అన్న ఆందోళన అప్పుడే మొదలైంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తే కొంత వరకూ ఆ ఓటమి బాధ కొంత వరకూ తగ్గిపోతుండొచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణపై ముందు నుంచి ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే కర్ణాటకలో విజయం సాధించింది. ఆ తరవాత తెలంగాణ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. తెలంగాణలోనూ విజయానికి దగ్గర్లో ఉన్నట్టే కనిపిస్తోంది. ఇది బానే ఉన్నా...హిందీ బెల్ట్‌ని పూర్తిగా కోల్పేయే ప్రమాదమైతే కనిపిస్తోంది. అక్కడ బీజేపీ రానురాను బలపడుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్‌పై ఆ ప్రభావం పడక తప్పేలా లేదు. భారత్ జోడో యాత్ర తరవాత కాంగ్రెస్‌కి జోష్ వచ్చిన మాట వాస్తవమే అయినా...ఉత్తరాదిన పట్టు కోల్పోతుందన్నదీ అంతే వాస్తవం. చేతిలో ఉన్న రెండు రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్) బీజేపీ వశమైతే ఇక కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల సంఖ్య మరింత తగ్గిపోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)