అన్వేషించండి

Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Five state Election Results : ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా మారుతున్నాయి. భిన్నమైన ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?


Elections Exit Polls :  పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జాతీయ మీడియా చానళ్లతో పాటు తెలంగాణ ఫలితాలపై ఇప్పటి వరకూ వినని, చూడని కంపెనీలు కూడా  ఫలితాలను ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో బిన్నమైన ఫలితాలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దాదాపుగా అన్ని  రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘడ్‌లలో గెలుపు ఎవరిదన్న దానిపై ప్రతిష్టాత్మక సంస్థలు సైతం భిన్నమైన ఫలితాలను ప్రకటించాయి. దీంతో మూడో తేదీన కౌంటింగ్ లో వచ్చే ఫలితాలు ఊహించని షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న మధ్యప్రదేశ్ ఎన్నికలు

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా కాలంగా సర్వేలు చెబుతూ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే చెప్పారు. కానీ రెండు, మూడు ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని అంచనా  వేశాయి. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజార్టీ సాధించినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీనే .. మళ్లీ శివరాజ్ సింగ్ చౌహానే సీఎం అయ్యారు. కానీ ఆయన పాలనపై చాలా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. గతంలో కూడా ఎన్నడూ లేనంత మెజార్టీ బీజేపీకి రావొచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ గెలుపునే అంచనా వేస్తున్నయి. అందుకే మధ్యప్రదేశ్ కౌంటింగ్ సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

రాజస్థాన్ లోనూ ఊహించని ఫలితాలను అంచనా వేస్తున్న ఎగ్జిట్ పోల్స్

రాజస్థాన్ లో  ఏ ఒక్క ప్రభుత్వాన్ని రెండో సారి ఎన్నుకున్న సందర్భంగా  గత ముఫ్పై ఏళ్లలో లేదు. పైగా కాంగ్రెస్ పార్టీలో సచిన్ పైలట్, గెహ్లాత్ మధ్య ఉన్న ఆధిపత్య  పోరాటంతో కాంగ్రెస్ పార్టీ నానా తిప్పలు పడుతోంది. అందుకే పోలింగ్ కు ముందు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అంచనాలు వచ్చాయి. రాహల్ గాంధీ కూడా ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము గెలుస్తామని ఆ ఒక్క రాష్ట్రం గురించే చెప్పలేదు. కానీ గట్టి పోటీ ఇస్తున్నామని మాత్రం చెప్పుకొచ్చారు. అయితే రాజస్థాన్ లో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో భిన్నమైన ఫలితాలను  ఇచ్చినట్లయింది. 

తెలంగాణలో కాగం్రెస్ కు ఎడ్జ్ ఉందని ఎగ్జిట్ పోల్స్

తెలంగాణలో  దాదాపుగా అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని అంచనా వేశాయి. అందుకే  అన్ని  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పాయి కానీ ల్యాండ్ స్డైడ్ విక్టరీని మాత్రం చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ గెలుస్తుందని కానీ బీఆర్ఎస్‌ విజయానికి దగ్గరగా ఉందని కానీ ఎవరూ చెప్పలేదు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు సాధిస్తేనే అధికారం వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 53 సీట్లు చాలు. మజ్లిస్ పార్టీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మజ్లిస్ సీట్లు సరిపోకపోతే..  బీజేపీకి లోటుపడే సీట్లు సాధిస్తే.. బీజేపీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. 

ఎగ్జిట్ పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. అసలు రిజల్ట్స్ మాత్రం  ఎంతో దూరంలో లేవు. మరి కొన్ని  గంటల్లోనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ స్టార్ట్ అయిన రెండు, మూడు గంటల్లో ట్రెండ్స్ తేలిపోతాయి. విజేతలెవరో తేలిపోతుంది. ఆ తర్వాత అసలు రాజకీయ పరిణామాలపై స్పష్టత వస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget