అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

BRS Candidates: గెలుపు తమదే అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థులు - రాహుల్ గాంధీనైనా ఎదుర్కొంటామని ధీమా

లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు ఆ పార్టీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత. విజయం తమదే అంటున్నారు. రాహుల్‌ గాంధీ పోటీచేసినా ఎదుర్కొంటామన్నారు నామా.

Nama Nageswara Rao, Maloth Kavitha on MP election: బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ (KCR) వరుస సమీక్షలు నిర్వహిస్తూ... ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు (Nama  Nageswara Rao), మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత (Maloth Kavitha)ను ఖరారు చేశారు. ఇవాళ... ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో భేటీ అయిన.. బీఆర్‌ఎస్‌ అధినేత లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు  దిశానిర్దేశం చేశారు. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాలు తీసుకుని... ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు,  మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత పేర్లను ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించింనందుకు... పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఖమ్మం, మహబూబాబాద్‌ నియోజకవర్గాల సమావేశంలో పార్టీ నేతలు ఏకగ్రీవంగా తన పేరును, మాలోతు కవిత పేరు ప్రపోజ్‌ చేసినట్టు చెప్పారు నామా నాగేశ్వరరావు. తమకు ప్రజల మద్దతు ఉందన్నారు నామా నాగేశ్వరరావు. కేసీఆర్‌  హయాంలోనే... తాగు, సాగు నీరుకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తమకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు నామా నాగేశ్వరరావు. పాతికేళ్లుగా  ప్రజాసేవలోనే ఉన్నామని చెప్పారాయన. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీతోపాటు ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటామని చెప్పారాయన. గెలుపోటములు కాదు.. ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం  చేశారు.

ఇక... మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కూడా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ...  మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు మాలోతు కవిత. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ  గురించి కూడా తాము పోరాడామన్నారు. బీఆర్‌ఎస్‌ పోరాటం వల్ల, కేంద్రంపై తమ ఎంపీలు ఒత్తిడి పెంచడం వల్లే... ములుగులో గిరిజన యూనివర్సిటీ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పుచేశామన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందని  అన్నారామె. కరెంటు, నీళ్ల ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపేయడం వల్ల... పొలాలు ఎండిపోతున్నాయని రైతులు చెప్తున్నారన్నారు. అలాగే.. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు అమలు  చేయకపోవడాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కొన్ని హామీలను మాత్రమే అమలు చేస్తూ... మిగిలిన వాటిని మరుగున పడేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు మాలోతు కవిత. మహిళలకు నెలకు 2వేల 500 రూపాయల  నగుదు, రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ, పింఛన్‌ పెంపుతోపాటు చాలా హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజల్లోనే ఎండగడతామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు..  బీఆర్‌ఎస్‌ వెంటనే ఉంటారని అన్నారామె. మహబూబాబాద్‌ సెగ్మెంట్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమాగా చెప్పారు. 

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనారోగ్యం కారణంగానే సమావేశానికి రాలేదన్నారు మాలోతు కవిత. కాంగ్రెస్‌లో ఆయనకు అవకాశం రాలేదని.. బీఆర్‌ఎస్‌లో ఉన్నారు కనుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు.  తెల్లం వెంకట్రావు పార్టీ  మారబోరని చెప్పారు. ములుగు నుంచి భద్రాచలం వరకు ఏడు నియోజకవర్గాల ప్రజలు తనను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు మాలోతు కవిత.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget