అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్‌- డీబీటీల పథకాల డబ్బుల విడుదలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

Telugu News: డీబీటీ పథకాల డబ్బుల విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం ఒక్కరోజే ఖాతాల్లో వేయాలని ఆదేశంచింది. ఎలాంటి ప్రచారం చేయొద్దని పేర్కొంది.

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ తర్వాత వివాదానికి కారణమైన డీబీటీ పథకాలపై హైకోర్టు కీలకనిర్ణయం తీసుకుంది.  ఈ డబ్బుల పంపిణీకి కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వానికి, లబ్ధిదారులకు బిగ్‌ రిలీఫ్ లభించింది. శుక్రవారం ఒక్కరోజు పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలా వేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎలాంటి ప్రకటనలు, ఎలాంటి ప్రచారం వద్దని ఆదేశాలు ఇచ్చింది. 

Image

Image

ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, చేయూత, పంట నష్టపరిహారంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 14వేల కోట్లకుపైగా వేయాల్సి ఉందని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సీఎస్‌ అనుమతి కోరారు. పోలింగ్ ముందు ఇలాంటివి చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని అందుకే పోలింగ్ అయిన తర్వాత రోజు నుంచి వేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై వైసీపీ సానుభూతిపరులు కొందరు కోర్టుకు వెళ్లారు. పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది.  
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఐదు గంటల పాటు ఈ వివాదంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇది కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఎన్నికల సంఘం వాదించింది. మే 13న పోలింగ్ ఉన్నందున పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే సమప్రాధాన్యత ఇచ్చినట్టు కాదని పేర్కొంది. జనవరి నుంచి మార్చి 16 వరకు ఇవ్వాల్సిన పథకాల నిధులు విడుదలను ఇప్పటి వరకు ఆపారు అంటేనే ఇందులో ఏదో మతలబు ఉందని ఈసీ వాదించింది. 

ఈసీ వాదనలపై స్పందించిన పిటిషనర్ల తరఫు లాయర్లు... ఇవి కొత్త పథకాలు కావని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని ఇప్పుడు ఇవ్వకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వాదించారు. నిధుల లభ్యతను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటుందని దీనికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని తెలిపారు. మొదట్లో అసలు జూన్‌ వరకు నిధుల విడుదలకు వీలు లేదని చెప్పిన ఎన్నికల సంఘం తాజాగా మే 14 తర్వాత విడుదల చేసుకోమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు డబ్బుు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని సూచించింది. దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయడం, ప్రచారం చేయడం వద్దని ఆదేశించింది. ఎన్నికల రూల్స్‌ను అతిక్రమించి ఎలాంటి చర్యలు చేయొద్దని నేతల జోక్యం లేకుండా పంపిణీ జరగాలని తేల్చి చెప్పింది. అనంతరం కేసును జూన్ 27కి వాయిదా వేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget