అన్వేషించండి

Political News: తెలుగుదేశం కంచుకోటలపై జగన్ చూపు, వైనాట్ 175 అంటున్న వైసీపీ చీఫ్

Jagan News: తెలుగుదేశం కంచుకోటలపై జగన్ చూపు, కుప్పం, మంగళగిరి,హిందూపురంలో గెలుపుకోసం ప్రత్యేక కసరత్తు

రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి (Ys Jagan)వైనాట్ 175 అంటూ ప్రతిన బూనారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి ఒక్కటంటే ఒక్కసీటు రాకుండా చేసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం( TDP) కంచుకోట సీట్లు, ముఖ్యనేతలు బరిలో దిగే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలోని కీలక నేతలకు అక్కడి బాధ్యతలు అప్పగించి నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ సీట్లలో పాగా వేసేందుకు సామ, దాన ,దండోపాయలన్నీ వినియోగిస్తున్నారు.
కుప్పంపై కన్నేశారు

మిగిలిన నియోజకవర్గ్గాల సంగతి ఎలా ఉన్నా... ముఖ్యంగా మూడు సీట్లపై సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ( Chandra Babu)పోటీ చేసే కుప్పంతోపాటు ఆయన కుమారుడు బరిలో ఉండే మంగళగిరి (Mangalagiri), బావమరిది బాలకృష్ణ ( Bala Krishna) నియోజకవర్గం హిందూపురం. 

ఈ మూడు నియోజకవర్గాల బాధ్యతలను పార్టీలోని ఇద్దరి కీలక నేతలకు అప్పగించారు. ముఖ్యంగా చంద్రబాబు పోటీ చేయనున్న కుప్పానికి ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddi Rama Chandra Reddy)కి బాధ్యతలు అప్పగించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సొంత నియోజకవర్గం కన్నా కుప్పంపైనే పెద్దిరెడ్డి ఎక్కువ దృష్టి సారించారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలను కనీసం నామినేషన్లు వేయనీయకుండ అడ్డుకున్నారు. వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీలు సహా పంచాయతీలు, జెడ్పీటీసులను వైసీపీ పెద్దసంఖ్యలో కైవసం చేసుకుంది. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారంటే... వైసీపీ(YCP) ఈసీటుపై ఎంత ముందస్తుగా దృష్టిసారించిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ లేనంతంగా చంద్రబాబు సైతం పదేపదే కుప్పంలో పర్యటించి శ్రేణులకు భరోసా ఇవ్వాల్సి వస్తోంది.

మంగళగిరిలో మరోసారి....
తెలుగుదేశం కీలక నేత నారా లోకేశ్ పోటీ చేయనున్న మంగళగిరి(Mangalagiri)లో మరోసారి పాగా వేయాలని సీఎం జగన్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను డిసైడ్ చేసే చేనేత కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఏడాది ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సామాజికవర్గంలో ఉన్న కీలక నేత గంజి చిరంజీవిని తెలుగుదేశం( TDP) పార్టీ నుంచి వైసీపీలోకి లాగేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. పార్టీలో నెంబర్‌ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి మంగళగిరిలో గెలుపు బాధ్యతలు అప్పగించారు. 

లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉండటంతో ... వైసీపీ లీడర్లు ఇక్కడ పనులు మెల్లగా చక్కబెడుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన యువనేత తక్షమే అప్రమత్తయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు..

హిందూపురంలో మహిళా కార్డు
తెలుగుదేశం కంచుకోట హిందూపురం(Hindhupuram) బద్దలు కొట్టేందుకు వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేయింబవళ్లు అక్కడే మకాం వేస్తున్నారు. కొత్త సమన్వయకర్తగా దీపికా రెడ్డిని తీసుకొచ్చారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను లోక్‌సభ అభ్యర్థినిగా బరిలో దింపుతున్నారు. 

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అసమ్మతివర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి కుటుంబానికి అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి మహిళా కార్డు చూపి మగువుల ఓట్లు కొల్లగొట్టేందుకు పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చలను కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేశారు. తెలుగుదేశంలోని అసమ్మతి వర్గాన్ని సైతం ఆయన చేరదీస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Embed widget