Actor Naresh On Pawan Kalyan : సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Andhra Politics : సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దని నటుడు నరేష్ సూచించారు. ఈ మేరకు ఆయన రెండు వరుస ట్వీట్లు పెట్టారు.
Actor Naresh Reaction : ఎన్నికల ప్రసంగంలో పవన్ కల్యాణ్ ..సూపర్ స్టార్ కృష్ణను విమర్శించారని తెలిసిన షాక్ కు గురయ్యారని నటుడు నరేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కృష్ణ గారి మనసు బంగారమన్నారు. పార్లమెంటు సభ్యుడిగా నైతిక విలువలకు పెద్దపీట వేశారని.. సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఆయన అందించిన సేవలు గొప్పవన్నారు. కృష్ణ తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవర్నీ కించపర్చలేదన్నారు.
I was shocked & deeply pained to see/ hear Mr Pawan Kalyan criticise super star late Sri Krishnagaru in his address . Krishna garu is known to have a heart of gold & a parliamentarian with ethics. his contribution to the film industry & and politics is yeomen . He never changed…
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) April 24, 2024
భవిష్యత్ లో అలాంటి మాటలు ఇక పవన్ అనవద్దని పవన్ను కోరారు. ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్ అంటే తనకెంతో గౌరవం ఉందని నరేష్ తెలిపారు. పవన్ లో తాను ఏపీ భవిష్యత్ ను చూస్తున్నాను అని నరేశ్ మరో ట్వీట్ లో వెల్లడించారు. ఏపీకి పునర్ వైభవం కల్పించేందుకు ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించాలని బీజేపీ మాజీ యువజన అధ్యక్షుడిగా, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
I humbly request one and all to delete such words regarding krishna garu in future. I have great regards towards Mr Pawan kalyan as an actor and politician . I see him as the future of Andhra Pradesh & as the former youth, president, and general secretary of Bjp I pray for a…
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) April 24, 2024
పవన్ ఏమన్నారంటే ?
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్.. తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దూషణల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గతంలో రాజకీయ నేతలు ఎంత హుందాగా ఉండేవారో చెప్పుకొచ్చారు. అలాంటి హుందా రాజకీయాల్లో కృష్ణ - ఎన్టీఆర్ మధ్య జరిగిన రాజకీయాల్ని ప్రస్తావించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో ఉండేవారని, ఎన్టీఆర్ ను కృష్ణ విమర్శించినా... ఎన్టీఆర్ ఎప్పుడూ కృష్ణను పల్లెత్తు మాట అనలేదని అన్నారు.
నాలుగు రోజుల తర్వాత స్పందించిన నరేష్
అయితే ఇలా ప్రసంగించి నాలుగు రోజులు దాటిపోయిన తర్వాత నరేష్ స్పందించారు. నరేష్ తల్లి విజయనిర్మల, కృష్ణ భార్య భర్తలు. నరేష్ తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగరిరావు చాలా సార్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశంలో పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ కృష్ణను ఏమీ విమర్శించకపోయినా అప్పటి రాజకీయాల గురించి మాత్రమే ప్రస్తావించినా.. ఏదో వివాదం ఉందన్నట్లుగా ట్వీట్ చేయడం దుమారం రేగుతోంది. నరేష్ అటెన్షన్ కోసం ప్రసంగించిన ఐదు రోజుల తర్వాత స్పందించారు. అంతే కాదు ఓ వైసీపీ సానుభూతిపరుడి వీడియోను షేర్ చేశారు.