అన్వేషించండి

Viral News: 30 ఏళ్ల తరువాత ఎగ్జామ్ - టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌లో తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్

SSC Results 2022: కుమారుడితో కలిసి పరీక్ష రాసిన తండ్రి పాస్ కాగా, టెన్త్ విద్యార్థి ఫెయిలయ్యాడు. దాంతో తండ్రి, కుమారులు ఇద్దరూ బాధపడుతున్నారు.

ఇటీవల ఏపీలో టెన్త్ ఫలితాలు రాగా, పాస్ శాతం తక్కువ రావడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం నాడు మహారాష్ట్రలోనూ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో 96.94 శాతం మంది పాస్​ అయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఇది కాస్త తక్కువ. అయితే అసలు విషయం ఏంటంటే.. కుమారుడితో కలిసి పరీక్ష రాసిన తండ్రి పాస్ కాగా, టెన్త్ విద్యార్థి ఫెయిలయ్యాడు. దాంతో తండ్రి, కుమారులు ఇద్దరూ బాధపడుతున్నారు. తాను పాసైనప్పటికీ టెన్త్ పరీక్షల్లో కుమారుడు ఫెయిల్ కావడం ఆ తండ్రిని బాధకు గురి చేస్తోంది. 

ఒకేసారి టెన్త్ పరీక్షలకు హాజరైన తండ్రి,కొడుకు
మహారాష్ట్ర పుణెకి చెందిన 43 ఏళ్ల భాస్కర్ వాఘ్మరె చాలా ఏళ్ల కిందట స్కూల్ చదువు మధ్యలోనే మానేశారు. 7వ తరగతిలో ఉండగా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువుకు గుడ్ బై చెప్పేశారు. ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబ బారాన్ని తనపై వేసుకున్నారు. కాగా, ఆయన కుమారుడు సహిల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షలకు కుమారుడు సాహిల్, తండ్రి భాస్కర్ వాఘ్మరె ఒకేసారి హాజరయ్యారు. తండ్రీకొడుకు ఒక్కసారి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన సమయంలో ఎలాగైతే విషయం వైరల్ అయిందో ఫలితాల తరువాత కూడా అదే సీన్ రిపీట్ అయింది.

తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్
కరోనా కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. ఇంటర్నల్ అసె‌స్ మెంట్ మార్కులతో ఫలితాలు ప్రకటించగా 99.95 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నిర్వహించిన టెన్త్ పరీక్షల ఫలితాలు శుక్రవారం నాడు మహారాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయగా 96.94 శాతం విద్యార్థులు పాసయ్యారు. దాదాపు 30 ఏళ్ల తరువాత మానేసిన చదువును టెన్త్ పరీక్షతో శ్రీకారం చుట్టారు భాస్కర్. ప్రతిరోజూ ఆఫీసు నుంచి వచ్చాక కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలకు ప్రిపేరయ్యారు. ఫలితాలు మాత్రం వారిని బాధించాయి. కుమారుడు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తాను పాసైనా తండ్రి అంత సంతోషంగా లేరు. 

ఈ ఏడాది ఎలాగైనా పరీక్షలు రాసి టెన్త్ కావాలని భావించినట్లు తండ్రి భాస్కర్ తెలిపారు. తన కుమారుడి సహకారంతో టెన్త్ పాసైనట్లు చెప్పిన ఆయన.. కుమారుడి ఫలితాలు బాధ కలిగించాయని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలలో ప్రిపరేషన్‌లో కుమారుడికి సాయం చేస్తానని చెప్పారు.

చాలా ఏళ్ల తరువాత పరీక్షలు రాసినప్పటికీ నాన్న పాసైనందుకు సంతోషంగా ఉందన్నాడు సాహిల్. తాను సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని, ఈసారి తప్పకుండా పాస్ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు టెన్త్ విద్యార్థి.

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget