By: ABP Desam | Updated at : 01 Mar 2023 09:03 AM (IST)
Edited By: omeprakash
యూవోహెచ్ డిప్లొమా కోర్సులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ 2023 సంవత్సరానికి దూర విద్య/ ఆన్‌లైన్ విధానంలో ఏడాది డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
➥ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్‌వర్కింగ్
➥ డిప్లొమా ఇన్ సైబర్ లాస్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్
➥ డిప్లొమా ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్
➥ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్
➥ డిప్లొమా ఇన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్
➥ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
➥ డిప్లొమా ఇన్ పంచాయత్ రాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
➥ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
➥ డిప్లొమా ఇన్ ఇన్ఫెక్షన్ నివారణ అండ్ కంట్రోల్
➥ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ ఐ హెల్త్
➥ డిప్లొమా ఇన్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300.
ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల మేరకు.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13.03.2023.
Notification & Online Application
Also Read:
టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు.
లాసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మహాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
TS EAMCET: టీఎస్ఎంసెట్ - 2023 షెడ్యూల్లో మార్పులు, కొత్త తేదీలివే!
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
Biometric Attendance: ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్ దూకుడు - వారినీ విచారణకు రమ్మంటూ నోటీసులు
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
TSRTC Ticket Fare: టోల్ ఛార్జి పెరిగింది ఆర్టీసీ ప్రయాణికులకు మోత మోగనుంది
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?