అన్వేషించండి

COE Admissions: ఎస్సీ గురుకుల కళాశాలల ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సీఓఈల్లో వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌డబ్ల్యూఆర్ సీఓఈ సెట్-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం జనవరి 20 వరకు పొడిగించింది.

TSWR Inter Admissions: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ల్లో వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌డబ్ల్యూఆర్ సీఓఈ సెట్-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం జనవరి 20 వరకు పొడిగించింది. ఈమేరకు విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం (జనవరి 16) ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 25న విడుదల చేయనున్నారు. జనవరి 3 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి డిసెంబరు 16న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWR) ప్రవేశాలు కల్పించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్‌ కూడా ఉచితంగా కల్పిస్తారు. 

వివరాలు..

* ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు

గ్రూప్‌: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.

సీట్ల సంఖ్య: 3,680. ఇందులో బాలురకు 1,680 సీట్లు, బాలికలకు 2,000 సీట్లు కేటాయించారు.

రిజర్వేషన్: ఎస్సీలకు 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2%, ఎస్టీలకు 6%, బీసీలకు 12%, మైనారిటీలకు 3%, ఓసీ/ ఈబీసీలకు 2% సీట్లు కేటాయించారు. ఎస్సీ-30, ఎస్సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్స్)-01, ఎస్టీ-02, బీసీ-05, మైనార్టీస్-01, ఓసీ/ఈడబ్ల్యూఎస్-01 సీట్లు కేటాయిస్తారు.

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు మించకూడదు.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఎంపీసీ/ బైపీసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్‌-1, 2); ఎంఈసీ/ సీఈసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్‌-1), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ప్రవేశ పరీక్ష విధానం..

➥ మొత్తం 160 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-1 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కుకాగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ పరీక్ష నిర్వహిస్తారు.  

➥ మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-2 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారికి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్-1 రాసినవారిలో 1 : 5 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్-2కు ఎంపికచేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ పరీక్ష నిర్వహిస్తారు.  
  
ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2024.

➥ హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలు: 25.01.2024 నుంచి 03.02.2024 వరకు.

➥ స్క్రీనింగ్ పరీక్షతేది: 04.02.2024.

Notification

Online Application

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Embed widget