అన్వేషించండి

TS EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణలో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21 నుంచి 26 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. 26న సీట్లను కేటాయిస్తారు.

తెలంగాణలో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. వీరికి అక్టోబరు 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వారు అక్టోబరు 21 నుంచి 23 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి అక్టోబర్ 26న సీట్ల కేటాయింపు ఉంటుంది.

సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్ట్ చేయాలి. రిపోర్టింగ్ సమయంలోనే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 27న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత 14, 202 సీట్లు మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 177 కళాశాలల్లో 78,336 కన్వీనర్ కోటా సీట్లుండగా.. రెండు విడతల్లో కలిపి 64,134 భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 2,691 సీట్లు మిగిలాయి.

తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
* అక్టోబర్ 21:  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్. 
* అక్టోబరు 22: సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ. 
* అక్టోబరు 21 నుంచి 23 వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు. 
* అక్టోబర్ 26: సీట్ల కేటాయింపు.
*  అక్టోబర్ 26 నుంచి 28 వరకు: ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్. 
* అక్టోబర్ 27: స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశ వివరాల ప్రకటన. 

మొదటి విడతలో..
ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల కోసం ఎక్కువ ఎంపిక చేసుకున్నారు. ఈ కోర్సుల్లోని 41,506 సీట్లు ఉండగా మెుదటి దశలో 40,878 సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 100 శాతం సీట్ల కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CSE (డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా 11 ఇతర కోర్సులు 90 శాతానికి పైగా సీట్లు కేటాయించారు.

రెండో విడతలో..
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు అక్టోబరు 16న సీట్లు కేటాయించారు. మొత్తం 21,136 మంది విద్యార్థులు కొత్తగా సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన 42,998 మంది కలిపి మొత్తం 64,134 మందికి సీట్లు పొందారు.  మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 20 శాతం మంది వరకు కళాశాలలు, బ్రాంచీలు మారారని అధికారులు తెలిపారు. రెండో విడతలో 53,848 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో కొత్తగా 3,547 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. తగినన్ని ఆప్షన్లు ఇవ్వని 4,590 మందికి సీట్లు రాలేదు. మొత్తం కన్వీనర్ సీట్లలో 81.87% భర్తీ అయ్యాయి.


:: ఇవీ చదవండి ::

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్‌ 2022-23 కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ అక్టోబరు 17న విడుదల కానుంది. తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

 

TSPECET: టీఎస్‌పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget